Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాల్లో నెలాఖరు వరకూ వడగాడ్పులు …!

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం నాడు పగటిపూట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెలిసియస్ నమోదు అయింది. భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు నెలాఖరు వరకూ కొనసాగవచ్చని హెచ్చరించింది. సోమవారం నాడు ఈ రెండు రాష్ట్రాల్లో వడగాడ్పులు కొనసాగాయి. మే 26,27, 28 తేదీల్లో మెరుపులతో తుపాను ప్రభావం ఉండవచ్చు తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం బీమ్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్త గూడెం, వరంగల్ అర్బన్, రూరల్, సూర్యాపేట, మహబూబ్ నగర్ లలో కూడా తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. ఆదివారం నాడు ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో తెలంగాణ మొత్తం మీద అత్యధిక ఉష్ణోగ్రత 46.6 సెలిసియస్ నమోదు అయింది. మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లోని జన్నారం, బాన్స్ వాడా, లలో 45 డిగ్రీల సెలిసియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది.

హైదరాబాద్ లో రామచంద్రపురం, బండ్ల గూడా లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయింది. ఈ రెండు ప్రాంతాల్లో 44 డిగ్రీల సెలిసియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఉప్పల్ లోని కొన్ని ప్రాంతాలు, సైదాబాద్, చార్మినార్, లలో 43.5 డిగ్రీల సెలిసియస్ నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెలిసియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 42.7 డిగ్రీలు, తిరుపతి , చిత్తూరులలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!