Take a fresh look at your lifestyle.

బాలికపై హోంగార్డ్ అత్యాచారం

ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన
మభ్యపెట్టి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డుపై తుకారాం గేట్‌ ‌పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గోపాలపురం ఏసీపీ వెంక టరమణ తెలిపిన వివరాల ప్రకారం..అడ్డగుట్టలో నివాసముండే బి మల్లికార్జున (40) హోంగార్డు. హైదరాబాద్‌ ‌సీసీఎస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఆయనకు పరిచయమైన బాలిక (16)ను కొద్ది రోజుల కిందట అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరికి చెప్పొద్దని ఆమెను భయపెట్టా డు. బాలికకు రెండు రోజుల కిందట ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హోంగార్డును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

Leave a Reply