Take a fresh look at your lifestyle.

కంటైన్‌మెంట్‌లో ఇంటింటి సర్వే

హన్మకొండ వడ్డెపల్లి పూరిగుట్ట కంటైన్‌మెంట్‌ ఏరియాలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే బుధవారం నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితా దేవి తెలిపారు. ప్రైమరీ కాంటాక్టు కేసుల జాబితాలో నమోదైన కేసులపై అప్రమత్తంగా ఉన్నామని, నగర పరిధిలోని కంటైన్‌మెంట్‌ ‌జోన్‌లలో ఇప్పటికే వైద్య సిబ్బంది పలు దఫాలుగా సర్వే నిర్వహించినట్లు ఆమె తెలిపారు. పూరిగుట్ట ప్రాంతంలో నూతనంగా నమోదైన పదేళ్ళ బాలికను సికింద్రాబాద్‌ ‌గాంధీకి తరలించి బాలిక కుటుంబ సభ్యులను, సన్నిహితులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించి వారి రక్తనమూనాలను  సేకరించి పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు.

అర్బన్‌ ‌జిల్లా పరిధిలో పాజిటివ్‌ ‌తేలిన కేసుల్లో పది మంది గాంధీ ఆసుపత్రిలో కొలు కోని డిశ్చార్జి అయినట్లు తెలిపారు. మరో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కంటైన్‌మెంట్‌ ‌జోన్ల పరిధిలో జలుబు, దగ్గు,జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్‌ ఎం‌జిఎం ఆసుపత్రితో పాటు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి క్వారంటైన్‌ ‌కేంద్రంలో అనుమానితులు 49మంది ఉన్నారు.వీరే కాకుండా ప్రైమరీ కాంటాక్టులుగాగుర్తించిన వారికి సంబంధించిన మరో47మంది ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!