Take a fresh look at your lifestyle.

వొస్తు వొస్తూనే ఏకగ్రీవ తీర్మానం

రంగంలోకి దిగిన ట్రబుల్‌ ‌షూటర్‌
‌హోం క్వారంటైన్‌ ‌నుంచి నేరుగా ప్రజల్లోకి…
ఇక దుబ్బాక ఉప ఫలితం వన్‌సైడే?
టిఆర్‌ఎస్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం
చేసిన నర్సంపేట గ్రామస్థులు
ఏకగ్రీవ తీర్మాన కాపీని మంత్రి హరీష్‌రావుకు అందజేత
నర్సంపేట గ్రామస్థుల బాటలోనే మరిన్ని గ్రామాలు?

టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో కీలక నేత… పార్టీకి వీర విధేయుడు… పార్టీ అధినేతకు నమ్మినబంటు… ట్రబుల్‌ ‌షూటర్‌… ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు రంగంలోకి దిగాడు. కొరోనా పాజిటివ్‌తో పది రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్న హరీష్‌రావు…కొరోనా నెగటివ్‌ ‌రావడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరై అక్కడి నుంచి నేరుగా దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చాడు. గత పది రోజులుగా ఇంటికి పరిమితమైన అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల హరీష్‌రావు అందరూ అనుకుంటున్నట్లుగానే వొస్తూ వొస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసేలా చేశాడు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరు తెచ్చుకున్న హరీష్‌రావు  మంచి వ్యూహకర్త….  పార్టీలో ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించడంలో దిట్ట.. ఎక్కడ ఎన్నికలైనా అక్కడ తనదైన మార్క్ ‌రాజకీయ చతురతతో కార్యకర్తలను నడిపించే నాయకుడు… పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను ఒంటిచేత్తో గెలిపించుకునే శక్తిసామర్థ్యాలు ఉన్న ఒకే ఒక్క లీడర్‌…అన్నింటికి మించి  ఆయనో ‘లక్ష్య’సాధకుడు…ఎన్నికల్లో సమస్య వచ్చిందంటే పరిష్కారం చూపడంలో ట్రబుల్‌ ‌షూటర్‌…ఎన్నికలేవైనా సరే తను అడుగిడితే చాలూ ‘వార్‌ ‌వన్‌సైడే’అని  కీర్తినందుకుంటున్నట్టుగానే దుబ్బాక ఉప ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్‌ ‌రాకముందే… రానున్న ఉప ఎన్నికలలో తమ గ్రామమంతా టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి మద్దతుగా ఉంటుందంటూ దుబ్బాక నియోజకవర్గంలోని నర్సంపల్లి గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడమే కాకుండా ఏకగ్రీవ తీర్మాన కాపీని మంత్రి హరీష్‌రావుకు అందజేశారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతి చెందినప్పటి నుంచి మంత్రి హరీష్‌రావు దుబ్బాక నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్‌ను పెట్టారు. ఓవైపు కొరోనా వైరస్‌కు చికిత్స తీసుకుంటూ..మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు హాజరై..ఇంకోవైపు  దుబ్బాక నియోజకవర్గ కార్యకర్తలకు అన్నీ తానై  ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కొంత  ఒడిదుడుకులు ఎదుర్కొంటుండటంతో అన్నింటికీ తాను ఉన్నాననీ నిలబడి, కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు నేనున్నాంటూ భరోసా ఇస్తూ ట్రబుల్‌ ‌షూటర్‌ ‌ముందుకు సాగుతున్నాడు. అంతేకాదు, దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపును తన భుజాలపై వేసుకున్నట్లు ఆయన  పర్యటనలు చెప్పకనే చెబుతున్నాయి.  అనుకోకుండా వచ్చిన ఈ దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక బాధ్యతను గులాబీ దళపతి, రాష్ట్ర ప్రభుత్వాధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రి హరీష్‌రావుకు అప్పగించినట్లు సమాచారం.

దుబ్బాక టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి బలమైన, అనుకూలమైన నియోజకవర్గం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. టిఆర్‌ఎస్‌ ‌పురిటిగడ్డ సిద్ధిపేటను ఆనుకుని ఉన్న దుబ్బాక ప్రాంత ప్రజలు, వోటర్లు  టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అయితే,  అనారోగ్యంతో  ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో  ఇప్పుడు వచ్చిన సమస్యను ధీటుగా ఎదుర్కొనే విధంగా ఈ ట్రబుల్‌ ‌షూటర్‌ను రంగంలోకి దింపారు ఆ పార్టీ బాస్‌. ‌దీంతో దుబ్బాక నియోజకవర్గంపై మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టిని పెట్టారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే  దుబ్బాక నియోజకవర్గంలో మూడు నాలుగు పర్యాయాలు పర్యటించారు. రాయపోల్‌, ‌దౌల్తాబాద్‌, ‌తొగుట, దుబ్బాక  మండలాల్లోని 352 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను, 275 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌చెక్కులను పంపిణీ చేశారు. మాచిన్‌పల్లిలో నిర్మించిన 33/11కెవి విద్యుత్‌ ‌సబ్‌ ‌స్టేషన్‌ను ప్రారంభించారు. మల్లేశంపల్లి గ్రామంలో రూ.1.10కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ.1.20 కోట్ల రూపాయల వ్యయంతో శేరిపల్లి బందారం-లింగరాజుపల్లి గ్రామాల మధ్య నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి  హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. దుబ్బాకలో ఆర్‌ ‌డబ్ల్యూఎస్‌ ‌మిషన్‌ ‌భగీరథ కార్యాలయాన్ని, 1 లక్షా 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ ‌ట్యాంకు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం దుబ్బాక మార్కెట్‌ ‌కమిటీ యార్డు ఆవరణలో రైతు వేదిక నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్‌ ‌రావు శంకుస్థాపన చేశారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ కొమురవెళ్లి మల్లన్న జలాశయ డిస్ట్రిబ్యూటరీ కాలువ భూ సేకరణ పనులు సూపర్‌ ‌స్పీడ్‌ ‌లో పూర్తి చేయాలని ఇరిగేషన్‌, ‌రెవెన్యూ శాఖ అధికారులను మంత్రి  హరీష్‌రావు ఆదేశించారు. దుబ్బాక నియోజవర్గస్థాయిలో రెండు పడక గదుల ఇండ్ల పురోగతి, కేటాయింపు, ఉపాధి హామీ పథకం, ఇతర అభివృద్ధి పనుల ప్రగతిపై జిల్లా అధికారులు, ఇంజనీరింగ్‌, ‌విద్యుత్‌, ‌మిషన్‌ ‌భగీరథ, రెవెన్యూ, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ అధికారులతో   హరీష్‌రావు సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Home Quarantine to Directly into the public1
దుబ్బాకలో కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి హరీష్‌రావు

నియోజకవర్గంలోని 25 గ్రామాలలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. వర్షాకాలం ఆలస్యం చేయకుండా లబ్దిదారులకు అందించాలన్నారు.  నియోజక వర్గంలో కరెంట్‌ ‌సమస్యకు లేకుండా చూడాలని, లో ఓల్టేజ్‌ ‌సమస్యలు ఉందొద్దని మంత్రి విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. కొత్తగా లేదా అదనంగా విద్యుత్‌ ‌ట్రాన్సఫార్మార్ల  నిర్మాణం అవసరమైతే వెంటనే చేపట్టాలని అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రైతు వేదికలు కు విద్యుత్‌ ‌సౌకర్యం కల్పించాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో వైకుంఠధామాలు, డంప్‌ ‌యార్డుల నిర్మాణం సెప్టెంబర్‌ ‌నెలా ఖరులోగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ అధికారులను మంత్రి అదేశించారు. త్వరితగతిన నిర్మాణాల పూర్తికి డెడ్‌లైన్‌ ‌పెట్టుకుని పని చేయాలన్నారు.  నియోజవర్గంలో పంచాయితీ రాజ్‌ ఇం‌జనీరింగ్‌ ‌చేపట్టిన గ్రామీణ రోడ్ల నిర్మాణం, భవనాల నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలన్నారు.  పనుల పూర్తికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో 11.99 కోట్లతో చేపట్టిన సిసి రోడ్ల పనులను సైతం పూర్తి చేయాలనీ పంచాయితీ రాజ్‌ ఇం‌జనీర్‌ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని 7మండలాలకు చెందిన ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహిస్తున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సాధక, బాధలు తెలుసుకుంటూ వాటిని సత్వరమే పరిష్కరిస్తున్నారు.  ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రింబవళ్లు దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి, పెండింగ్‌ ‌పనులపై మంత్రి హరీష్‌రావు  విరామం లేకుండా కసరత్తు చేస్తున్నారనీ సమాచారం.

ఏకగ్రీవాలు షురూ…
గులాబీ పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరున్న నాయకుడు. హరీష్‌రావు ఎక్కడైనా ఉప ఎన్నికలు జరిగాయంటే ఆయన అక్కడ కాలు పెడితే చాలూ  ఆ సీటు గెలిచి తీరాల్సిందే. సమస్య ఉన్న ప్రతి నియోజకవర్గంలో కాలుమోపడం, అక్కడ కార్యకర్తలను సన్నద్ధం చేయడం, నాయకులను సమన్వయం చేయడం, నేతలను ముందుకు నడిపించి గెలుపును అందుకోవడం హరీష్‌రావుకు అనవాయితీ. ఇప్పుడు దుబ్బాకలో జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మంత్రి హరీష్‌రావుపై వేయడంతో ఎప్పుడు ఉప ఎన్నికలొచ్చినా పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడం కోసం మంత్రి హరీష్‌రావు ఆల్‌రె‘ఢీ’రంగంలోకి దిగారు. ఇప్పుడు హరీష్‌రావు రంగంలోకి దిగి దుబ్బాక ఉప  ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసే పనిలో పడ్డారు. హోం క్వారంటైన్‌ ‌నుంచి వొస్తూ వొస్తూనే నర్సంపల్లి గ్రామస్థులందరూ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి మద్దతుగా ఉంటామనీ ఏకగ్రీవ తీర్మానం చేయడంతోనే మంత్రి హరీష్‌రావు పనితీరుకు అద్దం పడుతుంది. నర్సంపల్లి గ్రామం బాటలోనే నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామాలు నడిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.  సో… హరీష్‌రావు రంగంలోకి దిగడంతో దుబ్బాక ఉప  ఎన్నిక రసవత్తరంగా మారడమే కాకుండా…‘దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం వన్‌సైడే’అని అందరూ చర్చించుకుంటున్నారు.

Leave a Reply