- సినిమాహాల్స్,షాపింగ్‌మాల్స్ బంద్
- ఇంటర్, టెన్త్, ఇతర పబ్లిక్‌పరీక్షలు యథాతథం
ప్రపంచవ్యాప్తంగా కరోనా భూతం ప్రజలను భయపెడుతున్న నేపథ్యంలో తెలంగా ణ ప్రభుత్వం వ్యాధి నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలను ప్రారంభించింది. ఈ నెల 31 వరకు పాఠశాలకు సెలవులు ప్రకటించారు., సినిమాహాళ్లను షాపింగ్‌మాల్స్ బంద్ చేయాలని శనివారం ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది. అయితే ఇంటర్మీడియల్, పదోతరగతితో సహా ఇతర పబ్లిక్ పరీక్షలన్నీ యథావిధిగా నిర్ణయించిన తేదీలలో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 83కు చేరుకోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. హుటాహుటిన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని, ప్రజలు ఎటువంటి భయాందోళలనకు గురికావొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ నెల 20 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, సోమవారంతో సమావేశాలు ముగించే అవకాశాలు ఉన్నాయి.
Tags: Education Institutions, Shopping Malls & Movie Theaters