Take a fresh look at your lifestyle.

బహిరంగ ప్రదేశాల్లో హొలీ నిషేధం

ఆంక్షలు విధించిన నగర పోలీసులు
హొలీ సందర్భంగా హైదరాబాద్‌ ‌నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధానిలో బహిరంగ ప్రదేశాల్లో హొలీ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించారు. పరిచయం లేనివారిపై రంగులు వేయ్యకూడదని, వాహనాలు, భవనాలపై కలర్లు పోయకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‌

రంగుల పండుగ నేపథ్యంలో రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూతపడనున్నాయి. గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్‌ ‌చేయనున్నారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు ఆంక్షలు అమలు ఉంటాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply