జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద స్థానాల్లో గెలిచి సెంచరీ కొట్టడం ఖాయమని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం జాగృతి నాయకుడు పసుల చరణ్ వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు కరీంనగర్ వొచ్చిన ఆమె నగరంలోని పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక వి•డియాతో మాట్లాడారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు.
ఎన్నికల్లో మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ వెయ్యి కోట్లకు పైగా నిధులు తీసుకువొచ్చి నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జి రోడ్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకోరాని ఎంపీ సంజయ్ ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీల్ రావు తదితరులతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.