Take a fresh look at your lifestyle.

‘హైర్‌ అం‌డ్‌ ‌ఫైర్‌ ..!’ ‌సవరించిన కార్మిక చట్టం

“ఇం‌డస్ట్రియల్‌ ‌రిలేషన్స్ ‌కోడ్‌, 2020, ఈ ‌బిల్లు మధ్య-పెద్ద పరిణామ పరిశ్రమలలో లేబర్‌ను నియమించడం మరియు తొలగించడం అనే అంశంపై కొత్త నియమాలను చెబుతుంది. కొత్త నియమాల ప్రకారం లేబర్‌ను ఉద్యోగం నుంచి తొలగించటం సులభతరం అయ్యింది.కొత్త ఇండస్ట్రియల్‌ ‌రిలేషన్‌ ‌కోడ్‌ ‌ప్రకారం, 300 మంది కార్మికులతో ఉన్న పరిశ్రమలు ప్రభుత్వ  అనుమతి లేకుండా కార్మికులను ‘హైర్‌ అం‌డ్‌ ‌ఫైర్‌’ ‌చేయవచ్చు లేదా ప్లాంట్లను మూసి వేసుకోవటానికి ప్రభుత్వం అనుమతించింది. నార్త్  అమెరికాలో అమలు అయ్యే హైర్‌ అం‌డ్‌ ‌ఫైర్‌ అనే నమూనాను భారత ఆర్థిక వ్యవస్థకు తెచ్చుకున్నాం. దీని వలన జాబ్స్ ‌పెరుగుతాయి అని కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ ‌గంగ్వార్‌ అం‌టున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రియల్‌ ‌రిలేషన్‌ ‌కోడ్‌ ‌కార్మికుల సమ్మెకు వెళ్ళే హక్కుపై కొత్త షరతులను నిర్దేశిస్తుంది. యూనియన్లు ఇప్పుడు 60 రోజుల సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. లేబర్‌ ‌ట్రిబ్యునల్‌ ‌లేదా నేషనల్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌ట్రిబ్యునల్‌ ‌ముందు విచారణ పెండింగ్‌లో ఉంటే, కార్మికులు సమ్మెకు వెళ్ళలేరు. పాత చట్టం ప్రకారం అయితే కార్మికులు రెండు వారాల నుండి ఆరు వారాల నోటీసు ఇవ్వడం ద్వారా సమ్మెకు దిగేవారు.”

ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యా ంగం. మన రాజ్యాంగం అమ లుకు ముందు బ్రిటిష్‌ ‌వారు అమలులో ఉంచిన కొన్ని చట్టాలను సవరించటం లేదా రద్దు చేసుకోవటం చేస్తూనే వచ్చాం. అయితే ఈ మార్పుల వలన సామాన్య కార్మికులకు ఏం మేలు జరిగింది మనకి లాక్‌ ‌డౌన్‌ ‌కళ్ళకు కట్టింది. భారతదేశంలో కార్మిక చట్టాలలో మార్పులు చేర్పులు అనే విషయంలో మన రాజ్యాంగం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తూ వచ్చింది. ఏది ఏమైనప్పటికి రాజ్యాంగంలో పార్ట్ III ‌మరియు పార్ట్IV‌లో పొందుపరచబడిన కార్మిక ప్రాథమిక హక్కులు వాటిని రాజ్యం ఏవిధంగా పరిరక్షించాలి అనే నిర్దేశక సూత్రాలకు సంబందించిన బెంచ్‌ ‌మార్క్ ‌చట్టాలు అంటూ మన రాజ్యాంగం పేర్కొన్నది. మన రాజ్యాంగంలో పార్ట్ III ‌భారతదేశంలో కార్మిక చట్టాలకు బెంచ్‌ ‌మార్క్ అని చెబుతారు ఈ పార్ట్ III‌లో ఆర్టికల్‌ 12 ‌నుండి 35 వరకు దేశ పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించిన చట్టాల ప్రస్తావన ఉంది. ఈ చట్టాల ప్రకారం దేశ చట్టం ముందు మత, లింగ, కుల, పుట్టిన ప్రదేశంతో నిమిత్తం లేకుండా పౌరులందరు సమానత్వం కలిగి వుంటారు, అలాగే మాట..భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కలిగి వుంటారు. అంటరానితనం రద్దు, మరియు కర్మాగారాల్లో పిల్లలకు ఉపాధి కల్పించటంపై నిషేధం అనే హక్కుల ప్రస్తావన ఉంది. అధికారంలోకి ఎవరు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారు ఈ హక్కుల పరిరక్షణ చేయాలి. ఇక ఆర్టికల్‌ 14‌లో ఉన్న కార్మిక చట్టాలలో ‘‘సమాన పనికి సమాన వేతనం’’ అని ఉంది. ఈ చట్టం ప్రకారం, చట్టం ముందు అందరు సమానం అయిన నేపథ్యంలో పని చేసే వారందరికీ ‘‘సమాన పనికి సమాన వేతనం’’ అని ఉంది. అయితే ఈ ఆర్టికల్‌ అసంపూర్ణం అయిపోతుంది ఎందుకంటే శారీరక సామర్థ్యం, నైపుణ్యం లేని కార్మికులకు నైపుణ్యం కలిగిన కార్మికులకు సమాన జీతం చెల్లించాల్సిన అవసరం లేదు అనే మినహాయింపు ఉంది.

మొత్తం మీద మనకి ఉన్న కార్మిక చట్టాలు ఫ్యాక్టరీస్‌ ఆక్ట్ 1948, ఇం‌డియన్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌డిస్ప్యూట్స్ ఆక్ట్ 1947, ‌మినిమం వేజెస్‌ ఆక్ట్ 1948, ‌పేమెంట్‌ అఫ్‌ ‌వేజెస్‌ ఆక్ట్ 1936 , ‌సెక్సువల్‌ ‌హరస్స్మెంట్‌ అఫ్‌ ‌విమెన్‌ ఎట్‌ ‌వర్కుప్లేస్‌ ఆక్ట్ 2013,‌మెటర్నిటీ బెనిఫిట్స్ ఆక్ట్ 1961, ‌ది ప్రెమెంట్స్ అఫ్‌ ‌గ్రాచుటి ఆక్ట్ 1972, ‌పేమెంట్‌ అఫ్‌ ‌బోనస్‌ ఆక్ట్ 1965 ‌లేబర్‌ ‌లా కంప్లియన్సు రూల్స్ ,ఎం‌ప్లాయిస్‌ ‌ప్రోవిడెంట్‌ ‌ఫండ్‌, ఎం‌ప్లాయిస్‌ ‌స్టేట్‌ ఇన్సూరెన్సు, కలెక్టివ్‌ ‌బర్గయినింగ్‌, ఇం‌డస్ట్రియల్‌ ఎం‌ప్లాయిమెంట్‌ (‌స్టాండింగ్‌ ఆర్డర్స్ ) ఆక్ట్ 1946,‌వర్కర్స్ ‌కంపెన్సషన్‌ ఆక్ట్ 1923,MRTU &Ž PULP ఆక్ట్ 1971 ఇలా ముఖ్యమైన యాక్టుల రూపంలో కార్మిక హక్కులు ఉండేవి. ఇవి 411 క్లాజ్స్ 480 ‌సెక్షన్స్ ‌లో ఉంది 286 పేజీలలో నీటి మీది రాతలుగా ఉండేవి.

వీటిని 1966లో ఏర్పాటు చేసిన జస్టిస్‌ ‌గజేంద్ర గర్కర్‌ ఆధ్వర్యంలో మొదటి నేషనల్‌ ‌లేబర్‌ ‌కమిషన్‌ ‌సమీక్షించింది. అటుపై 1991లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుండి, కార్మికుల హక్కులను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత కాల కాంగ్రెస్‌ ‌ట్రేడ్‌ ‌యూనియన్‌ ‌నాయకుడు మురార్జీ దేశాయ్‌ ‌ప్రభుత్వంలో కేంద్ర లేబర్‌ ‌శాఖ మంత్రిగా కూడా పని చేసిన రవీంద్ర వర్మ అధ్యక్షతన వాజపేయి ప్రభుత్వం 1999 లో రెండవ నేషనల్‌ ‌లేబర్‌ ‌కమిషన్‌ ఏర్పాటు చేసింది. మెజారిటీ కేంద్ర కార్మిక సంఘాలు రెండవ నేషనల్‌ ‌లేబర్‌ ‌కమిషన్‌ ‌బహిష్కరి ంచాయి. కారణం ప్రపంచీకరణ, వాణిజ్యం, పరిశ్రమల సరళీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అభివృధ్ధికోసం అంతర్జాతీయ పోటీ ఎదుర్కోవటం కోసం కార్మిక చట్టాలు కుదించాలి అని రెండవ నేషనల్‌ ‌లేబర్‌ ‌కమిషన్‌ అన్నది. ఈ రెండవ నేషనల్‌ ‌లేబర్‌ ‌కమిషన్‌ ‌జూన్‌ 2002 ‌లో తన నివేదికను వాజపేయి ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం మన కార్మిక చట్టాలు నాలుగు లేబర్‌ ‌కోడ్స్ అయిపోయాయి. మొత్తం శ్రామిక చట్టాలను 29 చట్టాలుగా కుదించేశారు. ఈ కుదించిన చట్టాల ప్రాణాన్ని మరింత తీసేందుకు నిరంతరంగా మన దేశ ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే వున్నాయి.

మోడీ ప్రభుత్వం మొత్తం నాలుగు లేబర్‌ ‌కోడ్‌ ‌లను సమూలంగా మర్చి వేస్తూ నిర్ణయాలు తీసుకున్నది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే.. ఈ లేబర్‌ ‌కోడ్‌ ‌బిల్స్ 2019‌లో పార్లమెంట్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీకి వెళ్లాయి. ఈ కమిటీ అధ్యక్షుడు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన పట్నాయక్‌ ‌పార్టీకి దీజీణకి చెందిన బత్రూ హరి మెహతా. ఈ స్టాండింగ్‌ ‌కమిటీలో 13 మంది లోకసభ, ఇద్దరు రాజ్యసభకి చెందిన బీజేపీ ఎంపీలు ఉండగా కాంగ్రెస్‌ ఒక లోకసభ ఎంపీ, ఇద్దరు రాజ్య సభ ఎంపీలు సభ్యులుగా ఉండగా..దేశంలో ఉన్న మిగతా అన్ని పార్టీల ఎంపీలకు ఒక్కొక్క స్థానం ఈ స్టాండింగ్‌ ‌కమిటీలో దొరికింది. ఈ స్టాండింగ్‌ ‌కమిటీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో 100 మార్పులు కోరగా ప్రభుత్వం 74 మార్పులు చేసింది. 2019 ఆగస్టులో, పార్లమెంటు మొదటి లేబర్‌ ‌కోడ్‌ అయిన వేజ్‌ ‌కోడ్‌ ‌బిల్లును సవరిస్తూ ఆమోదించింది. ఇప్పుడు మూడు లేబర్‌ ‌కోడ్‌ ‌బిల్లులను సవరిస్తూ ఆమోదించింది. ఇప్పుడు సవరించిన బిల్లులు వాటి ప్రభావాలు చూద్దాం.

ఇండస్ట్రియల్‌ ‌రిలేషన్స్ ‌కోడ్‌, 2020, ఈ ‌బిల్లు మధ్య-పెద్ద పరిణామ పరిశ్రమలలో లేబర్‌ ‌ను నియమించడం మరియు తొలగించడం అనే అంశంపై కొత్త నియమాలను చెబుతుంది ఈ బిల్లు. కొత్త నియమాల ప్రకారం లేబర్‌ ‌ను ఉద్యోగం నుంచి తొలగించటం సులభతరం అయ్యింది.కొత్త ఇండస్ట్రియల్‌ ‌రిలేషన్‌ ‌కోడ్‌ ‌ప్రకారం, 300 మంది కార్మికులతో ఉన్న పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికులను హైర్‌ అం‌డ్‌ ‌ఫైర్‌ ‌చేయవచ్చు లేదా ప్లాంట్లను మూసి వేసుకోవటానికి ప్రభుత్వం అనుమతించింది. నార్త్ అమెరికాలో అమలు అయ్యే హైర్‌ అం‌డ్‌ ‌ఫైర్‌ అనే నమూనాను భారత ఆర్థిక వ్యవస్థకు తెచ్చుకున్నాం. దీని వలన జాబ్స్ ‌పెరుగుతాయి అని కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ ‌గంగ్వార్‌ అం‌టున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రియల్‌ ‌రిలేషన్‌ ‌కోడ్‌ ‌కార్మికుల సమ్మెకు వెళ్ళే హక్కుపై కొత్త షరతులను నిర్దేశిస్తుంది. యూనియన్లు ఇప్పుడు 60 రోజుల సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. లేబర్‌ ‌ట్రిబ్యునల్‌ ‌లేదా నేషనల్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌ట్రిబ్యునల్‌ ‌ముందు విచారణ పెండింగ్‌లో ఉంటే, కార్మికులు సమ్మెకు వెళ్ళలేరు. పాత చట్టం ప్రకారం అయితే కార్మికులు రెండు వారాల నుండి ఆరు వారాల నోటీసు ఇవ్వడం ద్వారా సమ్మెకు దిగేవారు.

ఆక్యుపేషనల్‌ ‌సేఫ్టీ, హెల్త్ అం‌డ్‌ ‌వర్కింగ్‌ ‌కండిషన్స్ ‌కోడ్‌ 2020, ఈ ‌బిల్లు లో 13 చట్టాలు ఉండేలాగా.. లేబర్‌ ‌కోడ్‌ ఆన్‌ ‌సోషల్‌ ‌సెక్కురిటీ 2020 బిల్లులో 9 చట్టాలు ఉండేలాగా ప్రభుత్వం సవరించింది. కార్మికులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితులను నియంత్రించే చట్టాలను సవరించింది. కొత్త కర్మాగారాలను సృష్టించడానికి ఏ పరిశ్రమ అధిపతి అయినా ముందుకి వస్తే ఈ కోడ్‌ ‌నిబంధనలను మినహాయించటానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇస్తుంది. రోజుకు ఎనిమిది గంటలు పని పరిమితి నిర్ణయిస్తుంది. మహిళలు అన్ని రకాల పనుల కోసం పరిశ్రమలలో ఉద్యోగం పొందటానికి అర్హులు. మహిళలు ప్రమాదకరమైన కార్యకలాపాలలో పనిచేయవలసి వస్తే, వారికి యజమాని తగిన భద్రత కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కోరుతుంది.

కార్మిక చట్టాలు అనేకానేకం ఉన్నప్పుడు దేశ కార్మికుడికి ఒరిగింది గుండు సున్నా.. ఈ మాట ఎందుకు అనుకోవలసి వస్తుందంటే 2011 నుంచి 2012 NSSO డేటా ప్రకారం మన దేశంలో 17% కార్మికులు సంఘటిత రంగంలో పనిచేస్తుండగా మిగతా శ్రామిక జనం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అసంఘటిత రంగ శ్రామికులకు మోడీ ప్రభుత్వం మార్చేసిన కార్మిక చట్టాలు అమోఘంగా ఉపయోగపడతాయి అని చెబుతుంటే బీజేపీ ట్రేడ్‌ ‌యూనియన్‌ అయినా భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ ఈ ‌చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలు అని మండి పడుతన్నది.

Leave a Reply