Take a fresh look at your lifestyle.

హిమాయత్‌ ‌సాగర్‌, ఉస్మాన్‌ ‌సాగర్‌ ‌గేట్లు ఎత్తడంతో.. మూసీకి భారీగా వరద

  • ఎనిమిది గేట్లు ఎత్తి నీటి విడుదల
  • నిజాంసాగర్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌తో నీటమునిగిన పంటలు..పంట నష్టం అంచనాల్లో జిల్లా అధికార యంత్రాంగం
  • ఎగువన వర్షాలు, గులాబ్‌ ‌తుఫాన్‌తో..నిండుగా ప్రవహిస్తున్న గోదారి

మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన వర్షాలతో ప్రాజెక్టులోకి 13,401 క్యూసెక్కుల వరద వొస్తున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 13,401 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుతం 638.50 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. మూసీ గరిష్ట సామర్థ్యం 4.46 టీఎంసీలుకాగా, 2.88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. హిమాయత్‌ ‌సాగర్‌ 10 ‌గేట్లు..ఉస్మాన్‌ ‌సాగర్‌ 6 ‌గేట్లు ఎత్తడంతో మూసీలోకి భారీగా వరద నీరు వొచ్చి చేరుతోంది. జియాగూడ నుంచి పురానా పూల్‌ ‌మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పురానాపూల్‌ 100‌ఫీట్‌ ‌రోడ్డు వి•దకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. అంబర్‌పేట ముసారాంబాగ్‌ ‌బ్రిడ్జి సవి•పంలో వరద ఉధృతిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకుపోతున్నట్లు కనిపించింది. ప్రవాహంలో మృతదేహం కొట్టుకుపోతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. వరద ఉధృతిలో మృతదేహం కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఘట్‌కేసర్‌ ‌వైపు మృతదేహం కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇటు పులిచింతలకు వరద పోటెత్తడంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 70,812 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 61,358 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 33.40 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

నిజాంసాగర్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌తో నీటమునిగిన పంటలు..పంట నష్టం అంచనాల్లో జిల్లా అధికార యంత్రాంగం
నిజాంసాగర్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌ ‌వల్ల మండలంలోని వివిధ గ్రామాల్లో వరి నిలువు పంట పొలాలు నిండా మునిగాయి. ఆయా గ్రామాల్లో పంట పొలాలను స్థానిక ప్రజాప్రతి నిధులు, నీటి పారుదల శాఖాధికారులు పరిశీలించారు. ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతన్నలు కోరారు. మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాల శివారులోని వరి పంట పొలాలు నిజాంసాగర్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌ ‌వల్ల ముంపుకు గురయ్యాయి. జిల్లాలో భారీ వర్షాలకు పంటలతోపాటు రోడ్లు దెబ్బతిన్నట్టు జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. ప్రాథమిక నివేదికను కలెక్టర్‌ ‌ద్వారా ప్రభుత్వానికి పంపించింది. తుపాను ప్రభావం వల్ల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసినా.. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి ప్రశాంత్‌రెడ్డి సూచించారు. మంజీరా, గోదావరికి భారీ వరద పోటెత్తడంతో బోధన్‌, ‌కోటగిరి, నవీపేట, రెంజల్‌, ‌నందిపేట మండలాల పరిధిలో బ్యాక్‌వాటర్‌ ‌వల్ల పంట పొలాలునీట మునిగాయి. బ్యాక్‌వాటర్‌ అం‌తకంతకూ పెరుగుతుండడంతో ఈ రెండు నదుల పరీవాహక ప్రాంత గ్రామాల్లోని రైతుల్లో ఆందోళన పెరిగింది. దిగువన ఉన్న జిల్లాల అధికారులకు సమాచారం ఇస్తూ ఈ నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. రెండురోజుల పాటు వరకు కుండపోత వర్షం కురిసింది. మోర్తాడ్‌, ‌భీంగల్‌, ‌సిరికొండ, ఏర్గట్ల, మోప్కాల్‌, ఎడపల్లి, నిజామాబాద్‌ ‌రూరల్‌, ‌ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పూలాంగ్‌, ‌కప్పలవాగు, పెద్దవాగు, గోన్‌గొప్పులవాగు, ముత్తాయికుంట వాగులు పొంగి ప్రవహించాయి. చాలా మండలాల పరిధిలో కల్వర్టులు, రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండల పరిధిలో పలు రోడ్లు కోతకు గురయ్యాయి. పెద్దవాగుకు భారీ వరద రావడంతో మోర్తాడ్‌ ‌వద్ద రైల్వే బ్రిడ్జిని తాకుతూ వరద పారింది. మోర్తాడ్‌ ‌మండలం గాండ్లపేట వద్ద వరద కాల్వ బ్రిడ్జిని తాకుతూ పారింది.

ఎగువన వర్షాలు, గులాబ్‌ ‌తుఫాన్‌తో..నిండుగా ప్రవహిస్తున్న గోదారి
గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాకాలం ఆరంభంలోనే వరదలతో ఈ యేడు గోదావరి ఉప్పొంగింది. మహారాష్ట్రతో పాటు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ఎక్కువగా వొస్తుంది. గోదావరికి మంజీరా, హరిదా నదులు కూడా తోడవడంతో వరద మరింత పెరిగింది. మహారాష్ట్రతో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీ నిండి.. వందల టీఎంసీల నీళ్లు గోదావరి ద్వారా సముద్రంలో కలిశాయి. ఈ యేడు మహారాష్ట్ర లోని నాందేడ్‌ ‌ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడి నుంచి కాళేశ్వరం వరకు ఇప్పటి వరకు వరద ప్రవాహం ఆగలేదు. గోదావరికి కందకుర్తి వద్ద మంజీరా, హరిదా నదులు కలవడంతో గడిచిన రెండు నెలలుగా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. త్రివేణి సంగమం రెండు నెలలుగా ఉప్పొంగి కనిపి స్తుంది. భక్తులకు కూడా స్నానాలు చేసేందుకు సమస్య లేకుండా ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో నీటిని వరద కాల్వ ద్వారా మిడ్‌మానేరుకు వదులుతున్నారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మికాల్వలతో పాటు గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలో ఎల్‌ఎం‌డీకి ఎగువన ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ సంవత్సరం గోదావరిపై ఉన్న ఔరంగాబాద్‌ ‌వద్ద ఉన్న జైక్వాడ్‌ ‌ప్రాజెక్టు నిండకున్నా కిందనున్న బాలేగాం, విష్ణుపురి ప్రాజెక్టులు నిండడంతో గడిచిన మూడు నెలలుగా వరద ప్రాజెక్టుకు వొచ్చి చేరుతోంది. ఎస్సారెస్పీ కింద ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండడం.. నీళ్లు వినియోగించే అవకాశం లేకపోవడంతో సముద్రంలో కలిశాయి. గులాబ్‌ ‌తుఫాన్‌ ‌కారణంగా కురిసిన వర్షాలతో తాజాగా శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, విద్యుత్‌ ఉత్పత్తి కోసం వరద కాల్వతో పాటు ఇతర కాల్వలకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ దఫా వందల టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశామని అధఙకారులు అన్నారు. ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరగడం వల్ల 32 గేట్లు ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నామని తెలిపారు. వర్షాలు పెరిగితే మరింత వరద పెరుగుతుందని, గోదావరి నది పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

Leave a Reply