నల్లగొండ వెళ్తుండగా అదుపు తప్పిన కారు
ఘటనపై ప్రముఖుల ఆరాా
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం హైదరాబాద్ నుంచి నల్లగొండకు వెళుతుందగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో దత్తాత్రేయ కారులోనే ఉండగా డ్రైవర్ సమయస్ఫూర్తితో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. దత్తాత్రేయ సహాయకుడికి స్వల్ప గాయాలు కాగా ఆయనను చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.. న్లగొండ పట్టణంలో పుర సన్మానం కార్యక్రమానికి హాజరు కావడానికి దత్రాత్రేయ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మరో వాహనంలో దత్తాత్రేయ నల్లగొండకు బయల్దేరి వెళ్లారు. ప్రమాదం విషయం తెలుసుకున్న చౌటుప్పల్ ఏసిపి సత్తయ్య, ఇన్స్పెక్టర్ వెంకన్నలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.