- కేంద్రపథకాలపై కూడా అధికారులు గ్రామాల్లో ప్రచారం చేయాలి
- జిల్లా అభివృద్ది సమన్వయ సమావేశంలో ఎంపి బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రచారం చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులే కీలకమని అన్నారు. కొరోనా సమయంలో జిల్లా అధికారులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. దేశంలోనే తొలిసారిగా కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా కొరోనా కేసులు వెలుగు చూసినప్పుడు అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండి కేసులను కంట్రోల్ చేసినందుకు అభినందనలు అన్నారు.
కరీంనగర్ జిల్లాను కొరోనా కట్టడిలో దేశంలోనే ఆదర్శంగా నిలిపారని..బీజేపీ పార్టీ ఇంటర్నల్ వి•టింగ్ లోనూ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కరీంనగర్ జిల్లా అధికారులకు అభినందలు చెప్పాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో అధికారులదే కీలక పాత్ర అన్నారు బండి సంజయ్. అయితే కొందరు అధికారుల తీరు సరిగ్గా లేదన్న సంజయ్.. ప్రొటో కాల్ విషయంలో తాను ఏనాడు అధికారులను ఏవి• అనలేదన్నారు. అది వారి విజ్ఞతకే వొదిలేస్తున్నానని.. వారిపై ఒత్తడి ఉండొచ్చు కానీ.. ప్రజాప్రతినిధుల కంటే అధికారులే శాశ్వతం అని గుర్తుంచుకోవాలన్నారు.