Take a fresh look at your lifestyle.

భావితరాల పేద విద్యార్థ్దులకు.. ఉన్నత చదువు, సర్కారు కొలువు కలగానే మిగిలిపోనుందా..!

“ఉన్న వాడు మరింత ఉన్నతంగా మారేందుకే ఈ ప్రయివేటు యూనివర్సిటీలు. అందుకే రానున్న రోజుల్లో పీడిత వర్గాల వారికి కొలువులు రావడం కష్టమే. పేదవారందరూ అటెండర్‌ ‌కొలువులకు మాత్రమే పరిమితం అవుతారు. ఉన్నత వర్గాల వారి పిల్లలే పై స్థాయి కొలువులు పొందుతారు. అందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రయివేటు యూనివర్సిటీలను అడ్డుకోక పోతే పీడిత వర్గాల వారి మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోనుంది. అందుకే విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, బుద్ధి జీవుల్లారా ఈ ప్రయివేటు  యూనివర్సిటీ ల స్థాపన కుట్రలను అడ్డుకుందాం, భావి తరాల యువత అభ్యున్నతికై పాటు పాటుపడుదాం…..”

కెజి నుండి పిజి వరకు అందరికి ఉచిత విద్యనుఅందిస్తామన్న నినాదాన్ని కొన్ని గురుకుల పాఠశాలలకు పరిమితంచేసి.ఉన్నత విద్యను ప్రయివేటికరణ కు వేగంపెంచింది కేసీఆర్‌ ‌ప్రభుత్వం. కొరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకొన్నది ప్రభుత్వరంగ వైద్యం మాత్రమే మరి అది యాదిమర్చి మళ్ళీ ప్రయివేటు యూనివర్సిటీ లకు అనుమతి ఇవ్వడం ప్రభుత్వ కుటిల బుద్దికి నిదర్శనమే. ప్రజలు కరోన సంక్షోభంలో కొట్టు మిట్టాడుతుంటే. పాలకులు మాత్రం తమ రహాస్య ఎజెండాను అమలుచేస్తున్నాయి కేంద్రప్రభుత్వం స్వదేశీ ప్యాకేజి ముసుగులో ఇన్సూరెన్స్, ‌విద్యుత్తు, బొగ్గు గనులు, ఎయిర్‌ ‌లైన్స్ ‌తదితర పబ్లిక్‌ ‌రంగ సంస్థలను ప్రయివేటు కు కుట్రలు ప్రారంభించగా. తెలంగాణా రాష్ట్రంలో చుప్‌ ‌చాప్‌ ‌గా తొలి ప్రయివేటు యూనివర్సిటీ లకు గవర్నర్‌ ‌తో ఆమోద ముద్ర వేయించుకున్నది.తెలంగాణ రాష్ట్రంలో ఐదు ప్రయివేట్‌ ‌యూనివర్సిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. కేసీఆర్‌ ‌సర్కారు తెలంగాణ స్టేట్‌ ‌ప్రయివేట్‌ ‌యూనివర్సిటీస్‌ (ఎస్టాబ్లిష్‌మెంట్‌ అం‌డ్‌ ‌రెగ్యులేషన్‌) ‌సవరణ ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చింది. దీనికి గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్ ‌ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఒక్కో ప్రయివేట్‌ ‌యూనివర్సిటీకి ప్రత్యేక చట్టాలను రూపొందించొచ్చు. కేసీఆర్‌ ‌సర్కారు ఇదివరకే తెలంగాణ స్టేట్‌ ‌ప్రయివేట్‌ ‌యూనివర్సిటీస్‌ ‌యాక్ట్ – 2018‌ను తీసుకొచ్చింది.

ప్రయివేట్‌ ‌యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం గెజిట్‌ ‌జారీ చేయడంతో.. కుత్బుల్లాపూర్‌ ‌మండలం బహదూర్‌ ‌పల్లిలో మహీంద్రా యూనివర్సిటీ, మెదక్‌ ‌జిల్లా సదాశివపేట మండలంలో వోక్సెన్‌ ‌యూనివర్సిటీ.. మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లా దూలపల్లి ఏరియా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ, వరంగల్‌ ‌జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో ఎస్‌ఆర్‌ ‌యూనివర్సిటీ, ఘట్‌కేసర్‌ ‌మండలం వెంకటాపూర్‌లో అనురాగ్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు కానున్నాయి. ఈ అయిదు యూనివర్సిటీ లలో. మహీంద్రా, వోక్సెన్‌ ‌మినహా మిగతా మూడు యూనివర్సిటీలు అధికార టీఆర్‌ఎస్‌ ‌నాయకులకు నేతలకు చెందినవే కావడం గమనార్హం. మల్లారెడ్డి యూనివర్సిటీ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినది కాగా.. అనురాగ్‌ ‌యూనివర్సిటీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డికి సంబంధించినది, ఎస్‌ఆర్‌ ‌యూనివర్సిటీ మరో టీఆర్‌ఎస్‌ ‌నేత వరదా రెడ్డి ది. వీరు విద్యా వ్యాపారం లో సంపాదించిన డబ్బులతో ఎన్నికల రాజకీయ వ్యాపార రంగంలో పదవులు సంపాదించి ఆ పదవుల ఆధారంగా తమ విద్యావ్యాపార సామ్రాజ్యాన్ని చట్టబద్ధంగా పదిల పర్చుకోవడానికి గవర్నర్‌ ‌ముద్రతో లైసెన్స్ ‌సంపాదించారు. ప్రయివేటికరణ రాజకీయాలలో రాజకేయాధికారాన్ని పెట్టుబడిగా పెట్టి తమ ఆస్తులను పెంచుకునే క్రోణిక్యా పిట లిజం దృక్పధం ఎలా ఉంటుందో మనకు ఒక ఉదాహరణగా ఈ ప్రయివేటు యూనివర్సిటీ లు చెప్పకనే చెబుతున్నాయి.

నూతన ఆర్ధిక పారిశ్రామిక విధానాలపెరుతో ఆర్ధిక సంస్కరణల ముసుగులో అన్ని పుబ్లిక్‌ ‌రంగ వ్యవస్థలను ప్రయివేటీ కరణ చేస్తూ వచ్చారు.అందులో ప్రాధమిక, మాధ్యమిక ,ఇంటర్‌ ‌విద్యా రంగాన్ని ఒక పథకం ప్రకారం కుప్ప కులుస్తూ వచ్చారు ఇన్నాళ్ళు మనం ప్రయివేటు పాఠశాలలు చూసాం, కళాశాలలు చూసాం ,, ప్రయివేటు ,కార్పొరేట్‌ ఆసుపత్రులను చూశాము నేడు కొత్తగా ప్రయివేటు విశ్వవిద్యాలయాలు చూడబోతున్నాం. గతంలో అన్ని సర్కారు బడులున్న కాలంలో అన్ని సామాజిక వర్గాలకు, కులాలు, మతాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే రకమైన చదువు చెప్పబడేది. ప్రభుత్వ పాఠశాల పని తీరు అద్భుతంగా ఉండి ఫలితాలు కూడా అంతే మొత్తంలో ఉండేవి. ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలు విఫలం చెందలేదు, తర్వాత ప్రభుత్వమే ఉన్నవారి చదువు కోసం ప్రయివేటు పాఠశాలలు తీసుకొచ్చి పరోక్షంగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడం జరిగింది. వాటిలో మౌలిక సదుపాయాలు కాని, ఉపాధ్యాయులను నియమించక పోవడం లాంటి చర్యల వలన ప్రయివేటు పాఠశాలలను ప్రజలు ఆదరించేలా చేసింది. ప్రజల ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులను విలన్లు గా చిత్రీకరించే ప్రయత్నాలు చేసింది.

తర్వాత ప్రయివేటు కళాశాలలకు అనుమతులివ్వడం జరిగింది. అప్పుడు కూడా వీటి పట్ల ఎవరు నిరసన తెలుపలేదు. గత ప్రభుత్వాలు ఫీజు రీఇంబర్స్ ఇవ్వడం మూలాన విచ్చల విడిగా పుట్టగొడుగులు లాగా వేల కోళ్ల ఫారమ్‌ ‌లు కళాశాలలు గా మారిపోయాయి. నేడు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ప్రయివేటు యూనివర్సిటీ లు తీసుకువచ్చింది. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని గద్దెనెక్కి నేడు ప్రయివేటు యూనివర్సిటీ లకు అనుమతులివ్వడం జరిగింది. దీని వలన మెజారిటీ గా ఉన్న మధ్య తరగతి మరియు పేద తరగతులకు తీరని నష్టం. ఎందుకంటే ఒక పీజీ చేయాలి అంటే ప్రస్తుతం కనీసం 5 నుండి 6 లక్షల డొనేషన్‌ ‌కట్టాలి. ఇంత మొత్తం లో కట్టడం ఏ వర్గాల వారికి సాధ్యం అవుతది. అంతే కాకుండా ఇందులో చదివిన చదవక పోయినా నకిలీ ధృవీకరణ పత్రాలు పొందడం ఉన్నవారికి మరియు దీన్ని స్థాపించిన వారి బందు మిత్రులందరికీ సులభం అవుతాయి. అంటే ధృవీకరణ పత్రాలు చాలా సులభంగా దొరుకుతాయి. ఇక మార్కుల విషయంలో తమ వారికి ఎక్కువ మార్కులు వేస్తారు. ఎందుకంటే సంస్థ పదికాలాల పాటు మనగలగాలి అంటే ఆ యూనివర్సిటీ లో చదివిన వారికి ఎక్కువ మార్కులు వస్తే నే కదా. ప్రభుత్వ యూనివర్సిటీ లో చదివిన వారి మార్కులు కూడా ప్రయివేటు యూనివర్సిటీ లో చదివిన వారితో పోలిస్తే తక్కువ గా ఉంటాయి. ముందు ముందు ఏ ఉద్యోగం పొందాలన్నా దానికి అకాడమిక్‌ ‌మార్కులను కొలమానంగా నిర్ణయిస్తారు, కావున ప్రభుత్వ యూనివర్సిటీ లో చదివిన వారు ఉద్యోగాలు పొందడం కష్టమే. తెలంగాణ రాష్ట్రం సాధించి 6 సంవత్సరాలు పూర్తవుతుంది.

నేటికి జూనియర్‌ ‌కాలేజి నుండి మొదలుకుంటే యూనివర్సిటీ స్థాయి వరకు ఒక్క అధ్యాపకున్ని నియమించింది లేదు. ఎంతోమంది పీహెచ్‌ ‌డీ పట్టాలతో ఈ నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు స్థాపించ పోతున్న ప్రయివేటు యూనివర్సిటీ ల వలన ఇక నియామకాలు చేపట్టడం అనేది జరగని పని. నాన్‌ ‌టీచింగ్‌ ఉద్యోగాలను కూడా ఇంతవరకు నియమించలేదు. అంటే ప్రభుత్వమే కుట్ర పూరితంగా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నాయి. దీనికి గల కారణం పేద ప్రజలందరు ఈ యూనివర్సిటీ లో చదివి కొలువు లు రాక ఉద్యమాలు, మరియు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ యూనివర్సిటీ లను ఉద్యమ కేంద్రాలు గా చేసుకుంటున్నారనేది ఒక కారణం అని ప్రభుత్వం లో ఉన్నత వర్గాలకు సంబందించిన పెద్దల వాదన, అయితే ఇప్పుడున్న పరిస్థితి లో ఉన్నత వర్గాల పిల్లలు ఈ యూనివర్సిటీ లలో చద వకపోవడం మరో కారణం అని చెప్పొచ్చు. ఉన్న వాడు మరింత ఉన్నతంగా మారేందుకే ఈ ప్రయివేటు యూనివర్సిటీలు. అందుకే రానున్న రోజుల్లో పీడిత వర్గాల వారికి కొలువులు రావడం కష్టమే. పేదవారందరూ అటెండర్‌ ‌కొలువులకు మాత్రమే పరిమితం అవుతారు. ఉన్నత వర్గాల వారి పిల్లలే పై స్థాయి కొలువులు పొందుతారు. అందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రయివేటు యూనివర్సిటీలను అడ్డుకోక పోతే పీడిత వర్గాల వారి మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోనుంది. అందుకే విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, బుద్ధి జీవుల్లారా ఈ ప్రయివేటు యూనివర్సిటీ ల స్థాపన కుట్రలను అడ్డుకుందాం, భావి తరాల యువత అభ్యున్నతికై పాటు పాటుపడుదాం…..కొరోన కష్టకాలంలో సమాజాన్ని ఆదుకొన్నది ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వరంగ వైద్యులు కానీ ఆరోగ్యశ్రీ పేరుతో కోట్లాది రూపాయలు దొబ్బితిన్న కార్పొరేట్‌ ‌వైద్య రంగం కాదు ఈ కండ్లముందు కదులాడుతున్న పరిస్థితులు చూసైనా అన్ని వ్యవస్థ లను ప్రభుత్వరంగంలో ఏర్పాటుచేసి భాధ్యత ప్రభుత్వానిది, పరిరక్షించే భాద్యత పౌరసమాజానిది ….
– ధర్మార్జున్‌, ‌తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Leave a Reply