Take a fresh look at your lifestyle.

కాండం పూత పద్ధతిలో పత్తిలో అధిక దిగుబడి : ఏఓ

కాండం పూత పద్ధతి ద్వారా పత్తి పంటలో అధిక దిగుబడులను పొందవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి అడిదల సంపత్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మడిపల్లి గ్రామంలో పత్తి పంటలో కాండనికి మందు పూసే పద్ధతిని ప్రయోగాత్మకంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తిలో తొలిదశలో పచ్చదోమ, పెనుబంక, తెల్లదోమ, పిండినల్లి వంటి రసం పీల్చు పురుగుల నివారణకు మొదటి దశలో విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారి చేయకుండా కాండానికి మందు పూసే పద్ధతిని రైతులు పాటించాలని తెలిపారు.

ప్రత్తిలో 30 నుండి 45 రోజులలో మోనోక్రోటోఫాస్‌, ‌నీరు 1.4 నిష్పత్తిలో, మొక్కకు 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్‌ ‌లేదా ప్లోనికామిడ్‌, ‌నీరు 1.20 నిష్పత్తిలో కాండం భాగంలో రుద్దాలని సూచించారు. ఈ విధానాన్ని పాటించడం వల్ల పత్తి పంటలో రసం పీల్చే పురుగు ఉధృతిని తగ్గించి అధిక దిగుబడులను సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు శంకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply