- దుబ్బాక బై పోల్ వోట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం…
- కారు జోరా…? కమలం వికాసమా?
- 10 గంటల లోపే ఫలితం..సర్వత్రా ఉత్కంఠ..
- హోరాహోరీలో గెలుపెవరిదో…
నరాలు తెగే ఉత్కంఠ. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి మరికొన్ని గంటల వ్యవధిలోనే రిజల్ట్ వెలువడనున్నది. దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సంబంధించి సిద్ధిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో సంబంధిత అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఏడు మండలాలలో(చేగుంట, నార్సింగ్, రాయపోల్, దౌల్తాబాద్, మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట) కలిపి మొత్తంగా ఒక లక్షా 98వేల పైచిలుకు వోట్లు ఉండగా వీటిలో 82శాతం వరకు పోల్ అయ్యాయి. అంటే, దాదాపుగా ఒక లక్షా 64వేలకు పైగా వోటర్లు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సోలిపేట సుజాత-రామలింగారెడ్డి, బిజెపి అభ్యర్థిగా మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

ఈ ఉప ఎన్నికల్లో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ అంటూ ఇచ్చిన సర్వే వివరాలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా చెప్పాయి. ఇదిలా ఉంటే, ఫస్టు టైం అధికార టిఆర్ఎస్ పార్టీకి బిజెపి అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినట్టుగా తెలిపాయి. దీంతో ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులను విపరీతమైన టెన్షన్‌కు గురి చేస్తున్నది. గెలుస్తామన్న ధీమాపైకి కనబడుతున్నప్పటికీ…లోలోపల మాత్రం ఫలితం ఏమైనా తారు మారైతే పరిస్థితి ఏంటన్నది తలుచుకుంటూ…నేతలు, అభ్యర్థులు టెన్షన్‌కు గురౌతున్నారనీ అత్యంతమైన విశ్వసనీయవర్గాలు సోమవారమిక్కడ ‘ప్రజాతంత్ర’ ప్రతినిధికి తెలిపాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం గురించి స్థానిక రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధప్రదేశ్‌కు చెందిన వాళ్లు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉప ఎన్నికను పురస్కరించుకుని మిషన్ చాణక్య, ఆరా, థర్డ్ విజన్, నాగన్న వంటి పలు సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించాయి. పోలింగ్‌కు ముందు, పోలింగ్ తర్వాత కూడా సర్వేలు చేసినట్లు చెబుతున్నాయి కూడా. సర్వేలు నిర్వహించిన పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా వెల్లడించాయి. మెజార్టీ సర్వే సంస్థలు అధికార టిఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని అంచనా వేశాయి. అయినా, అధికార పార్టీ నేతల్లో మాత్రం టెన్షన్ కనిపిస్తోందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పోలింగ్ నమోదు, పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ ఫలితాల్లో టిఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య హోరా హోరీ పోటీ నెలకొందన్న ఫలితాలతో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం గుబులు రేపుతుందనే సంకేతమిస్తోంది. ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు ప్రకటించిన మిషన్ చాణక్య.. బిజెపికికి ఏకంగా 51.82 శాతం వోట్లు వొస్తాయని తెలిపింది. టిఆర్ఎస్కు 35.67 శాతం వోట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. మిషన్ చాణక్య సర్వే ప్రకారం బిజెపి 16 శాతానికి పైగా వోట్లతో కారు కంటే ముందుంది. అంటే దాదాపు 30 వేల వోట్లకు ఎక్కువే. పొలిటికల్ లేబొరేటరీ సంస్థ కూడా బిజెపికి 47 శాతం వోట్లు, కారుకు 38 శాతం వోట్లు వొస్తాయని తెలిపింది. అయితే పొలిటికల్ లేబొరేటరీ సంస్థ సర్వే ఫలితాలను కొట్టిపారేసిన కారు పార్టీ నేతలు..మిషన్ చాణక్య అంచనాలతో మాత్రం ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. ఆరా సంస్థ అంచనాల్లో కారుకే లీడ్ ఉంది. అయితే అది స్వలంగా ఉంది. టిఆర్ఎస్కు 47.72 శాతం, బిజెపికి 44.6 శాతం వోట్లు వొస్తాయని ఆరా తెలిపింది. ఇందులో మూడు శాతం అటు ఇటుగా జరగవొచ్చని కూడా సంస్థ వెల్లడించింది. అంటే ఆరా సంస్థ అంచనా ప్రకారం దుబ్బాక బైపోల్లో ఎవరైనా గెలవొచ్చు. తమకు నమ్మకమైన ఆరా సంస్థ కూడా హోరాహోరీ పోరు జరిగిందనే అంచనాలు ఇవ్వడంతో టిఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనాయకులు ఒకింత టెన్షన పడటానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. నాగన్న సర్వేలో మాత్రమే టిఆర్ఎస్కు 50 శాతానికి పైగా వోట్లు వస్తాయని తేలింది.

హోరాహోరీ….గెలుపెవరిదో
దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నప్పటికీ…ఈ ఉప ఎన్నిక పోలింగ్ హోరాహోరీగా సాగిందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పలు సర్వేలు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తాయనీ చెబుతున్నప్పటికీ…బిజెపి అభ్యర్థి నుంచి టిఆర్ఎస్ పార్టీ గట్టి పోటీని ఎదుర్కొందనీ సర్వేలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రధానంగా మహిళలు టిఆర్ఎస్ పార్టీకి వోట్లు వేశారన్న గట్టి ధీమాలో అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమనీ, మహిళలు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుజాతకు పట్టం కట్టారనీ దీనికి నిదర్శనమే పెరిగిన వోటింగ్ శాతమనీ టిఆర్ఎస్ నేత ఒకరు చెప్పారు. ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించి పొరుగు రాష్ట్రాల నేతలు కూడా ఎంతో ఆసక్తికనబరుస్తున్నారు. గెలుపు వోటములపై భారీగా బెట్టింగ్‌లు కూడా కట్టారనీ అత్యంతమైన విశ్వసనీయవర్గాలు ఇక్కడ తెలిపాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం స్థానిక పార్టీల అభ్యర్థుల రాతలనే మార్చడం కాకుండా, ఆయా పార్టీల రాష్ట్ర నాయకుల తలరాతలు కూడా మార్చేవిగా అందరూ భావిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ప్రభావంపై అనేక పార్టీల భవితవ్యం, నేతల భవిష్యత్ ఆధారపడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరూ ఔనన్నా, కాదన్నా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం త్వరలో జరగనున్న జిహెచ్ఎంసి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం పడనున్నది. దీంతోనే ఆయా పార్టీల అభ్యర్థులకంటే నేతలే ఎక్కువగా టెన్షన్ పడటానికి కారణంగా తెలుస్తుంది.

పోటా పోటీగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లోనే తేలనున్నది. వోట్ల లెక్కింపుకు సంబంధించి సిద్ధిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో సంబంధిత అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మంగళవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా…10గంటల వరకు గెలిచేది ఎవరనేది తేలిపోనున్నది. ఇదిలా ఉంటే, దుబ్బాక నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో అధికార పార్టీ నుంచి రామలింగా రెడ్డి సతీమణి సుజాత, ప్రతిపక్ష పార్టీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా కత్తి కార్తీక, మరో నలుగురు చిన్న పార్టీల నుంచి బీఫామ్ తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో 15 మంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మొత్తం 20 రౌండ్లు 23 టేబుల్స్ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి భారతి తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలలో 82.62 పోలింగ్ శాతం నమోదయింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన దుబ్బాక నియోజకవర్గానికి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరగగా.. ఫలితాలపై ఎప్పుడూ లేనంత ఆసక్తి ఈసారి ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి.హొ ఏది ఏమైనా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై యావత్ దేశమే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.