Take a fresh look at your lifestyle.

పాడితో అధిక లాభాలు : కేసీరెడ్డి

రైతులు వ్యవసాయంతో పాటు పాడిగేదెలను పోషించుకున్న•్లయితే అధిక లాభాలు పొందవచ్చునని పీఏసీఎస్‌ ‌చైర్మన్‌, ‌డీసీసీబీ డైరక్టర్‌ ‌కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి అన్నారు. తరిగొప్పుల మండలంలోని మరియపురం గ్రామానికి చెందిన తానుగుల చిన్నపురెడ్డి అనే రైతుకు ఇటీవల డీసీసీ బ్యాంక్‌ ‌ద్వారా రూ.2లక్షలు రుణం అందించడంతో పాడిగేదెలను కొనుగోలు చేయడం జరిగింది. పాడిగేదెలను గురువారం పీఏసీఎస్‌ ‌చైర్మన్‌, ‌మేనేజర్‌ ‌వేణుగోపాల్‌రెడ్డి, సీఈవో వెంకటయ్యలు పరిశీలించారు. ఒక్కొక్క పాడిగేదె 8లీటర్ల నుంచి 10లీటర్ల వరకు పాలు వస్తున్నాయని రైతు చిన్నపురెడ్డి వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంకు ద్వారా అందించిన రుణంతో రాజమండ్రి నుంచి పాడిగేదెలను కొనుగోలు చేసి తీసుకురావడం జరిగిందన్నారు.

మేలు రకం జాతి పాడిగేదెలను కొనుగోలు చేసినందున రైతు కుటుంబానికి ఆర్థికంగా ఎన్నుదన్నుగా నిలిచేందుకు దోహదపడుతాయన్నారు. వ్యాపార, గృహ, విద్య, వ్యవసాయ రుణాలు అందిస్తూ తమ బ్యాంకు ముందంజలో ఉందన్నారు. రుణాలు పొందిన రైతులు నియమ, నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించి బ్యాంకు అభివృధ్ధికి సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ‌పాలనలో రైతులు సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతోనే రైతులకు అన్ని విధాల రుణాలు అందించాలనే తపనతో ఈ అవకాశం కల్పించడం జరిగిందన్నారు. రైతుబాగుంటనే దేశం, రాష్ట్రం బాగుంటుందనే విషయం గమనించి రైతుల ముంగిటనే బ్యాంకు సేవలు అందించడం జరిగిందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!