Take a fresh look at your lifestyle.

వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత

లేకుంటే కొరోనా వెన్నంటే ఉంటుంది
వైద్య నిపుణుల హెచ్చరిక

కొరోనా వైరస్‌ ‌ప్రభావం ఇప్పట్లో పోయే పరిస్థితి లేనందున ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిందేనని వైద్యులుసూచిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కొరోనాను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన   లాక్‌డౌన్‌ ఈ ‌నెలాఖరు వరకు కొనసాగనుంది. ఈ లోగా సడలింపులు ఇచ్చారు. దీంతో వ్యాధి సంక్రమణకు అవకాశాలు పెరిగాయని, కొరోనా వైరస్‌ ‌నియంత్రణకు వైద్య  నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ ‌కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్న నేపథ్యంలో కొరోనా నియంత్రణకు పలు సూచనలు పాటించాలని చెబుతున్నారు. వేడి నీళ్లు ఎక్కువ తాగడం, వేడి నీళ్లు గొంతులో పోసుకుని పుక్కిలించడం, వేడి నీళ్లలో పసువు కలుపుకుని తాగడం, వేడి వేడి టీ, కాఫీలు తాగాలని పేర్కొంటున్నారు. అందరూ తమ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, అందుకోసం విటమిన్‌ ‌సి, సిట్రస్‌ ఎక్కువగా ఉండే పళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. నిత్యావసర సరుకులు తీసుకోవడానికి బయటకి వెళ్లినప్పుడు మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు గేటు హ్యాండిల్‌ ‌గానీ, డోర్‌ ‌హ్యాండిల్‌ ‌గానీ పట్టుకోవద్దని, నేరుగా వాష్‌రూంకు వెళ్లి బట్టలు విప్పి సోప్‌ ‌లేదా డిటర్జెంట్‌లో వేసి, తలస్నానం చేయాలని చెబుతున్నారు. అలాగే ఐస్‌ ‌క్రీం, కూల్‌ ‌డ్రింక్స్ ‌వంటి చల్లటి వస్తువులు ఏవి• తీసుకోవద్దని సూచించారు. చల్లటి వస్తువులకు దూరంగా ఉండాలంటున్నారు. ఎండాకాలం కారణంగా కూల్‌ ‌డ్రింకుల జోలికి వెళ్లొదన్నారు.

కొరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. ఉద్యోగాల కోసం పోయేవారు పోగా, చిన్నపిల్లలు వృద్దులు ఇళ్లకే పరిమితం కావాలని  సూచిస్తున్నారు. చేతులను శానిటైజర్లు, సబ్బుతో 20 నుంచి 30 సెకన్ల పాటు  శుభ్రంగా కడుక్కోవాలని పేర్కొంటున్నారు.

ముఖాన్ని చేతులతో తాకవద్దు, ముఖ్యంగా కళ్లు, ముక్కు, నోటి భాగాలకు తాకరాదని, దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు ముఖానికి మో చేతులు అడ్డం పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఇతరులతో కనీసం మూడు వి•టర్ల దూరం పాటించాలని చెబుతున్నారు. ఎవరికైనా కొరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే భౌతిక దూరం తప్పనిసరి చేసుకోవాలన్నారు. ఇతరులను కలుసుకోవడానికి అప్పుడే తొందర పడరాదన్నారు.

Leave a Reply