Take a fresh look at your lifestyle.

వికారాబాద్‌ ‌జిల్లాలో ఉన్నత స్థాయి అధికారుల బృందం పర్యటన

వికారాబాద్‌ : ‌కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా వికారాబాద్‌ ‌జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందం వికారాబాద్‌ ‌సందర్శించి అనంతరం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌ ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొరోనా మహమ్మారి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌సూచించారు. కరోనా స్పెషల్‌ ‌టీంతో పలు సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్‌ ‌మెతుకు ఆనంద్‌ ‌సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ‌డిజిపి మహేందర్‌ ‌రెడ్డి, వైద్యశాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ శాంతకుమారి, ప్రత్యేక అధికారి రజత్‌ ‌కుమార్‌లతో కలిసి వికారాబాద్‌ ‌నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించారు.

- Advertisement -

నియోజకవర్గంలో ఉన్న వలస కార్మికులకు, రేషన్‌ ‌కార్డు లేని పేదలకు అందరికి రేషన్‌తో పాటు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు అందించాలని తెలిపారు. జిల్లాలో పోలీస్‌ ‌సిబ్బంది తక్కువగా ఉన్నారని, వేరే మండలాల నుండి సిబ్బందిని పట్టణంలో డిప్యూట్‌ ‌చేయడం వల్ల మండలాలలో సమస్యలు అధికం అవుతున్నాయని, కావున సిబ్బందిని నియమించాలని, పట్టణంలో కొరోనా అనుమానితులు ఇంకా ఉన్నారని, వారిని వెంటనే గుర్తించి పరీక్షలు నిర్వహించాలని డిజిపికి తెలిపారు. వికారాబాద్‌ ‌జిల్లాలో ఇప్పటివరకు 38 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా అందులో 31 వికారాబాద్‌ ‌పట్టణంలో ఉన్నాయని అందుకు కొరోనా పరీక్షలు ఇంకా ఎక్కువ మందికి చేయాలని వైద్యశాఖ ప్రిన్సిపాల్‌ ‌సెక్రెటరీ శాంతకుమారికి తెలిపారు.

Leave a Reply