Take a fresh look at your lifestyle.

నేరేడుచర్లలో .. హైడ్రామా

High Drama At Nereducharla

  • మున్సిపల్‌పీఠాన్ని దక్కించుకున్న టీఆర్‌ఎస్‌
  • ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేవిపీల అరెస్టు, విడుదల
  • ఇవి నీచరాజకీయాలు : కోమటిరెడ్డి
  • ఎక్స్అఫిసియో వోటుపై కె కె వివరణ

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీలో చైర్మన్‌, ‌వైస్‌చైర్మన్‌ ఎన్నికలో హైడ్రామా చోటు చేసుకుంది.ఎక్స్ అఫిసియో ఓటుతో మునిసిపాలిటీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ ‌ప్రయత్నిస్తే, ఎత్తుకు పైఎత్తు వేసి టీఆర్‌ఎస్‌ ‌కూడా ఎక్స్ అఫిసియో ఓటునే ఉపయోగించి ఈ మునిసిపాలిటీని సాధించుకున్నది. సోమవారం నాడు జరిగిన రాజకీయ పరిణామాలకన్నా తీవ్రస్థాయిలో ఉత్కంఠభరితంగా మంగళవారం పరిణామాలు జరిగాయి. సోమవారం ఇక్కడ ఎన్నిక వాయిదాపడింది. టీఆర్‌ఎస్‌ ‌డబ్బులు పంచి, అక్రమంగా,అన్యాయంగా, అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలిచిందని, పై నుంచి కేసీఆర్‌,‌కేటీఆర్‌, ‌నీతివాక్యాలు పలకడం సిగ్గుచేటని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. మండిపడ్డారు. ఎన్నికల హాలు నుంచి నిరసనగా బయటికి వచ్చారు. ఎన్నికలను బహిష్కరించారు. రోడ్డుపై బైఠాయించారు. ధర్నా చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, కేవిపీ రామచంద్రరావును,ఇతర కాంగ్రెస్‌ ‌నాయకులను పోలీసులు అరెస్టు చేసి మిర్యాలగూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించి విడుదల చేశారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైద్రాబాద్‌ ‌చేరుకొని గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. . కాగా నేరేడుచర్లలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉన్నప్పటికీ, అన్నీ రకాల రాజకీయ ప్రయోగాలను చేసి గులాబీజెండాను ఎగురవేశారు. కాంగ్రెస్‌ ‌రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇక్కడ ఎక్స్ అఫిసియో ఓటును వినియోగించుకోవడాన్ని టీఆర్‌ఎస్‌ ‌ప్రశ్నించింది. తుక్కుగూడా మునిసిపాలిటీలో కే. కేశవరావు ఓటుహక్కును ఉపయోగించుకోవడాన్ని కాంగ్రెస్‌ ‌ప్రశ్నించింది.వాస్తవానికి ఈ రెండు మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌పార్టీకి చెందిన వారే వార్డు సభ్యులుగా విజయం సాధించారు. మునిసిపాలిటీ మాత్రం గులాబీఖాతాలో చేరింది.హైడ్రామా పద్ధతిలో జరిగిన నేరేడుచర్ల ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చందమల్లు జయబాబు చైర్మన్‌గా న్నికయ్యారు.

టీఆర్‌ఎస్‌ ఎంఎల్‌సీ శేరిసుభాష్‌రెడ్డి ఓటుతో టీఆర్‌ఎస్‌ ఇక్కడ గెలిచింది. వేరే ప్రాంతానికి చెందిన ఎంఎల్‌సీకి ఎక్స్ అఫిసీయో ఓటు హక్కును కల్పించడాన్ని సవాల్‌ ‌చేస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రిటర్నింగ్‌ అధికారిని నిలదీశారు. అన్యాయంగా, అక్రమంగా జరుగుతున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఎన్నికజరిగే సమావేశమందిరం నుంచి వాకౌట్‌ ‌చేశారు. మునిసిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నికలో ఓటువేసే అభ్యర్థుల పేర్లను ఇచ్చేందుకు సోమవారం ఉదయం తోనే గడువు ముగిసిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాదం. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు మంగళవారం ఉదయం ఎన్నికల సమయానికి శేరిసుభాష్‌రెడ్డి పేరును చేర్చి ఎన్నిక నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రక్రియను కాంగ్రెస్‌ ‌నిరసించింది. బహిష్కరించింది.

కే.కే ఎక్స్అఫిసియో ఓటు అన్యాయం మర్రిశశిధర్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు తన ఎక్స్ అఫిసియో ఓటు హక్కును తుక్కుగూడాలో వినియోగించుకోవడాన్ని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు మర్రిశశిధర్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.కేకే ఆంధ్రప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యులని ఆయన ఓటు చెల్లదని మర్రిశశిధర్‌రెడ్డి ఎన్నికల సంఘం ముందు వాదించారు. ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదులను స్వీకరించాలని అభ్యర్థించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో అక్రమాలు జరుగతున్నా, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. శేషన్‌ ‌వంటి ఎన్నికల అధికారి ఉన్నట్లయితే తాము ఫిర్యాదు చేయాల్సిన అవసరం కూడా ఏర్పడేది కాదని అన్నారు. ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ప్రకారం విస్తృతాధికారాలు ఉన్నాయని, ఆ అధికారాలను ఉపయోగించు కొని అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

   కే.కే .వివరణ

తుక్కుగూడా మునిసిపాలిటీలో తాను ఎక్స్ అఫిసియో ఓటును వినియోగించుకోవడం న్యాయసమ్మతమేనని రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు వివరణ ఇచ్చారు.ఈ మేరకు ఎన్నికల సంఘానికి తన వివరణను అందచేశాక•రు. కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రాంతానికి, తనను తెలంగాణకు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నామని, ఈ మేరకు నోటిఫికేషన్‌ ‌జారీ అయ్యిందని పేర్కొన్నారు. ఇంకా వివరాలు కావాలంటే పార్లమెంట్‌ ‌సెక్రటరీ జనరల్‌ ‌నుంచి వివరాలను తీసుకోవచ్చునని అన్నారు. అదేవిధంగా మరికొంత మంది రాజ్యసభ సభ్యులు తమ ప్రాంతాలను మార్చుకున్నారని వివరణ ఇచ్చారు.

తెలంగాణ సమాజాన్ని అవమానించేలా మున్సిపల్‌ ఎన్నికలు

సుప్రీంకోర్డు ప్రధానన్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తాం: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రజాతంత్ర ,హైదరాబాద్‌ : ఈ ‌మున్సిపల్‌ ఎన్నికలు తెలంగాణ సమాజాన్ని అవమానించేలా జరిగాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు.చాలా సిగ్గు పడే విధంగా కేటీఆర్‌ ఎన్నికలు నిర్వహించారని మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌ ‌లో ఆయన మాట్లాడుతూ….ఇలా ఎన్నికలు నిర్వహించే బదులు వాళ్లే ఒక లిస్ట్ ‌రాసుకొని ప్రకటిస్తే సరిపోయేదని ఆరోపించారు.టీఆరెస్‌ ‌మిషన భగీరథ లో దోచిన డబ్బులు ఎన్నికల్లో పంచారని విమర్శించారు. ప్రభుత్వానికి వార్డ్ ‌రిజర్వేషన్‌ ‌ల నుంచి చెప్పం నామినేషన్‌ ‌లకు గ్యాప్‌ ఉం‌డాలని కానీ పట్టించుకోకుండ హైకోర్టు లో హియరింగ్‌ ఐపోగానే సాయంత్రం నోటిఫికేషన్‌ ఇచ్చారని అన్నారు. తెలంగాణ లో న్యాయ వ్యవస్థ గురించి పార్లమెంట్‌ ‌లో ప్రస్తావిస్తానని రాష్ట్రపతి కి అలాగే సీజేఐ దృష్టికి తీసుకెళ్తామన్నారు.తెలంగాణ లో మున్సిపల్‌ ఎన్నికల తీరు రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు ఏమాత్రం బాలేదన్నారు.ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం జరిగినట్టు ఎప్పుడు జరగలేదని క్యాండెట్లను బెదిరించడం, విత్‌ ‌చేసుకోమని చెప్పడం చేసారని విమర్శించారు.

కేటీఆర్‌ ‌నెరేడుచర్ల విషయం పై గంట గంటకు అధికారులకు ఫోన్‌ ‌చేసి పేర్లు మార్చారని ఆరోపించారు.ఎన్నికల ప్రక్రియ మొదలై ఇద్దరు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసాక స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రెసిడెంగ్‌ ఆఫీసర్‌ ‌చేతిలో పేపర్స్ ‌మైక్‌ ‌విరగొట్టారు పోస్ట్ ‌ఫోన్‌ ‌చేసి ఉదయం కు మరో ఓటు నమోదు చేశారని సీఎండీ శ్రీదేవి, ఎన్నికల సంఘం నాగిరెడ్డి అధికారులకు ఫోన్‌ ‌చేసిన స్పందించలేదనఈ ఎన్నికల ప్రక్రియ ను కాంగ్రెస్‌ ‌పార్టీ తీవ్రంగా కండిస్తుందన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ,రాజ్యసభ సభ్యుడు కేవీపీ పాల్గొన్నారు.కేశవరావు పెట్టుకున్న అప్లికేషన్‌ ‌ను రాజ్యసభ సెక్రెటేరియట్‌ ‌తిరస్కరించింది ఈ వయస్సులో కేశవరావు అబద్ధాలు ఆడటం తగదని జీవన్‌ ‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ‌ను నోడల్‌ ‌జిల్లాగా ఎంపిక చేసుకున్నని గతంలో కృష్ణ జిల్లా ఉండేనని కేవీపీ రామచంద్ర రావు తెలిపారు.2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇక్కడే వోట్‌ ‌చేసాను ఆ తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లో హైదరాబాద్‌ ‌లోనే వోట్‌ ‌వేశానని గుర్తు చేశారు.1980 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌ ‌లోనే వోట్‌ ‌హక్కు వినియోగించుకున్నాను నేను ఎవ్వరి దాయదక్షిణ్యాలు మీద వోట్‌ ‌వెయ్యలేదన్నారు.

Tags: ktr neredcharla, Rajya Sabha Secretariat,KVP Ramachandra Rao, tpcc uttam kumar, arrest

Leave a Reply