Take a fresh look at your lifestyle.

సాదాబైనామాల రెగ్యులరైజ్‌పై హైకోర్టు స్టే

  • కొత్త రెవెన్యూ చట్టం వొచ్చాక కూడా ఎలా చేస్తారని ప్రశ్న
  • తదుపరి విచారణ వరకు నిలిపి వేయాలని ఆదేశాలు

‌కొత్త రెవెన్యూ చట్టం వొచ్చాక అందిన సాదాబైనామాల దరఖాస్తులు పరిశీలించవొద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాదాబైనామాలు రద్దయినప్పుడు దాని ప్రకారం భూములను ఏవిధంగా రెగ్యులరైజ్‌ ‌చేస్తారో చెప్పాలని ప్రశ్నించింది. అయితే పూర్తి వివరాలతో కౌంటర్‌ ‌దాఖలు చేయడానికి రెండు వారాల గడువు ఇవ్వాలని అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌కోరారు. దీంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొత్త దరఖాస్తులు పరిశీలించవద్దని హైకోర్టు ఆదేశించింది. సాదాబైనామాల విచారణ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టం అక్టోబర్‌ 29 ‌నుంచి అమల్లోకి వొచ్చిందని అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌తెలిపారు. అక్టోబర్‌ 10 ‌నుంచి 29 వరకు 2 లక్షల 26 వేల 693 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

అక్టోబర్‌ 29 ‌నుంచి నిన్నటి వరకు 6 లక్షల 74 వేల 201 దరఖాస్తులు అందాయని చెప్పారు. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొత్త చట్టం అమల్లోకి వచ్చాక అందిన దరఖాస్తులు పరిశీలించవద్దని  హైకోర్టు ఆదేశించింది. 2 లక్షల 26 వేల 693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పుకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది.సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించి నిర్మల్‌ ‌జిల్లాకు చెందిన రైతు షిండే వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాక ముందు అందిన దరఖాస్తులు మాత్రమే పరిశీలించవొచ్చని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 6,74,201 దరఖాస్తులను కూడా పరిశీలించవద్దని హైకోర్టు ఆదేశించింది. 2,26,693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పునకు లోబడి ఉండాలన్న హైకోర్టు సూచించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply