Take a fresh look at your lifestyle.

న్యాయవాద జంట హత్య కేసును సుమోటో స్వీకరించిన హైకోర్టు

సకాలంలో దర్యాప్తును పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశం
విచారణ మార్చి 1కి వాయిదా

‌పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు- వెంకట నాగమణి హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. జంట హత్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉంది. తీవ్ర గర్హనీయం.

ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకోవాలి. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలి. విశ్వాసాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి’ అని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల శివారులో మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై దుండగులు వీరిపై దాడి చేసి హతమార్చారు. ఈ క్రమంలో, వామన్‌రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ1గా కుంట శ్రీనివాస్‌ను, ఏ2గా అక్కపాక కుమార్‌ను, ఏ3గా వసంతరావును పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.(ఆర్‌ఎన్‌ఎ)

Leave a Reply