Take a fresh look at your lifestyle.

హైకోర్టు సిజెగా జస్టిస్‌ ‌సతీష్‌ ‌చంద్రశర్మ

సిఫారసు చేసిన సుప్రీమ్‌ ‌కోర్టు కొలీజియం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్‌ ‌చంద్రశర్మ పేరును సుప్రీమ్‌ ‌కోర్టు కోలీజియం సిఫారసు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన కర్ణాటక యాక్టింగ్‌ ‌సీజేగా పని చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా పని చేసిన జస్టిస్‌ ‌హిమాకోహ్లి సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ప్రస్తుతం తాత్కాలిక సీజేగా రామచంద్రరావు కొనసాగుతున్నారు. అయితే సుప్రీమ్‌ ‌కోర్టు కొలీజియం చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌కు పంపారు. ఆంధప్రదేశ్‌ ‌సీజేగా జస్టిస్‌ ‌ప్రశాంత్‌ ‌కుమార్‌ ‌మిశ్రాను నియమిస్తూ కూడా సుప్రీమ్‌ ‌కోర్టు కొలీజియం సిఫారసు చేసినట్లు తెలుస్తుంది.

Leave a Reply