Take a fresh look at your lifestyle.

మా హైకమండ్‌ ‌ప్రజలే: మంత్రి హరీష్‌ ‌రావు

High Command, Peoples, Minister Harish Rao, farmer insurance, mla madhan reddy
ఇచ్చిన హా మేరకు అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి మంత్రి హరీష్‌ ‌రావు

ప్రజాతంత్ర, మెదక్‌: ‌మిగితా పార్టీలకు హైకమాండ్‌ ‌ఢిల్లీలో ఉంటుందని కానీ..మా హైకమాండ్‌ ‌మాత్రం తెలంగాణ ప్రజలే అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధి లక్ష్యాలను సాధించే పార్టీ ఎదో ప్రజలు గుర్తించాలన్నారు. ఇచ్చిన హాల మేరకు పనులు చేస్తున్న ఏకైక పార్టీ టిఆర్‌ఎస్‌ అని అన్నారు. పనిమంతులు ఎవరో.. మాట తప్పని వారు ఎవరో గుర్తించి ఓటు వేయాలని మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ తెస్తా అని హా ఇచ్చిన కేసీఆర్‌ ‌తెలంగాణ వచ్చుడో..కెసిఆర్‌ ‌చచ్చుడో అని అన్న మాట నెరవేర్చారని గుర్తు చేశారు. నర్సాపూర్‌ ‌నియోజకవర్గం హనుమంతాపూర్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజల పార్టీ అని, అందుకే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయండని కోరారు. 24 గంటల కరెంటు ఇస్తానని, పింఛను రూ.2వేలకు పెంచుతామని, రైతుబంధు, రైతు బీమా లపై హా ఇచ్చి సీఎం అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. కాంగ్రెస్‌, ‌బీజేపీ, ఇండిపెండెంట్ల చేతిలో ఏ లేదు. రు ప్రేమతో గెలిపించుకున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అభివృద్ధి పనులు పట్టుబట్టి చేయించుకున్నారు. ఆపద, కష్టం ఉన్నవారికి సాయం చేసే పార్టీ టీఆర్‌ఎస్‌. ‌కారు గుర్తుకు ఓటు వేయండి. పనులు చేయించుకోండి. డిపాజిట్‌ ‌రాని పార్టీలకు ఓటు వేయకండని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీపై గులాబీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు.

నగర సమగ్రాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతారన్నారు. పట్టణ అభివృద్ధి జరుగలేదని కొందరు ప్రతిపక్ష నాయకులు విమర్శలకు దిగడం అర్థరహితమన్నారు. ఐదేండ్లకు ముందు పరిస్థితి ఇప్పటి పట్టణ పరిస్థితి వారికి అర్థంకాక పోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.

Tags: High Command, Peoples, Minister Harish Rao, farmer insurance, mla madhan reddy

Leave a Reply