Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో హైల అలర్ట్ ఉ‌గ్రవాదుల కుట్రల నేపథ్యంలో భారీ బందోబస్తు

జమ్మూ-కశ్మీరులో ఉగ్ర కుట్ర భగ్నం… నలుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్
భారత స్వాతంత్య దినోత్సవం వేళ.. అధికారులు ఢిల్లీలో హై అలర్ట్‌ను ప్రకటించారు. రాజధానిలో ఉగ్రవాదులు భారీ అల్లర్లకు కుట్ర చేస్తున్నట్లు నిఘా సంస్థల నుండి ఢిల్లీ పోలీసులకు సూచనలు అందడంతో భారత ఆర్మీ అప్రమత్తమయ్యింది. ఢిల్లీ అంతటా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆయుధాలతో ఉన్న అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి 55 సెవి• ఆటోమోటెడ్‌ ‌పిస్టల్స్, 50 ‌బుల్లెట్స్ ‌స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఐదువేల మంది సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎత్తైన భవనాలపై ఎన్‌ఎస్‌జి, స్వాత్‌ ‌కమాండోలు పహారా కాస్తున్నారు. ఎత్తైన భవనాలపై కైట్‌ ‌క్యాచర్స్, ‌షార్ప్ ‌షూటర్‌లను నియమించినట్లు తెలుస్తుంది.

జమ్మూ-కశ్మీరులో ఉగ్ర కుట్ర భగ్నం… నలుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్
‌జమ్మూ-కశ్మీరు పోలీసులు శనివారం నలుగురు జైషే మహమ్మద్‌ ఉ‌గ్రవాదులను అరెస్టు చేయడంతో భారీ ఉగ్రవాద దాడి ముప్పు తప్పింది. స్వాతంత్య ్రదినోత్సవాలనాడు పెద్ద ఎత్తున దాడి చేసేందుకు వీరు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. జైషే మహమ్మద్‌ ఉ‌గ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు, వారి అనుచరులు భారీ కుట్ర పన్నినట్లు జమ్మూ-కశ్మీరు పోలీసులు తెలిపారు. డ్రోన్ల ద్వారా వొచ్చిన ఆయుధాలను సేకరించి, కశ్మీరులోని ఇతర ఉగ్రవాదులకు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆగస్టు 15కు ముందే జమ్మూలో ఓ ఐఈడీని అమర్చడానికి వీరు ప్రయత్నించారన్నారు.

దేశవ్యాప్తంగా ముఖ్యమైన సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వీరు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సెకండ్‌ ‌హ్యాండ్‌ ‌మోటార్‌ ‌సైకిల్‌ను సంపాదించి, జమ్మూలో ఐఈడీ పేలుడుకు ఉపయోగించాలని ఆదేశించారని చెప్పాడు. ఈ ఐఈడీని డ్రోన్‌ ‌ద్వారా జారవిడుస్తామని చెప్పారని తెలిపాడు. పుల్వామాలో పండ్ల వ్యాపారం చేస్తున్న మరొక ఉగ్రవాది జహంగీర్‌ అహ్మద్‌ ‌జైషే మహమ్మద్‌ ఉ‌గ్రవాద సంస్థకు యువతను రిక్రూట్‌ ‌చేస్తున్నాడని వెల్లడైందని పోలీసులు తెలిపారు.

Leave a Reply