Take a fresh look at your lifestyle.

దాచిపెడితే పేదరికం మరుగవుతుందా !

Hide poverty in hiding!

దేశంలోని పేదరికం దాచిపెట్టినంతమాత్రా న దాగేది కాదు. నిరుపేదవర్గాలు నివసించే ప్రాంతాన్ని కంటికి కనిపించకుండా తాత్కాలికంగా చేయగలిగినంత మాత్రాన దేశం సమగ్రాభివృద్ధి చెందిందని భావిస్తార నుకోవటం పెద్ద పొరపాటే అవుతుంది. స్వతంత్య్రం వచ్చి ఏడుపదుల ఏళ్ళుదాటినా ఏ నగరంలో, పట్టణాల్లో చూసినా మురికివాడలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ప్రభుత్వాలు మారి, పథకాలెన్ని రచించినా వారి బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదనడానికి ఆ మురికివాడలే ప్రత్యక్ష సాక్ష్యం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌మొదటిసారిగా ఈనెల 24న ఇండియా పర్యటి స్తున్న సందర్భంగా, ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగత ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కు ఆయన్ను తీసుకువెళ్తున్నారు. గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదిగా సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో, లక్షా ఇరవై అయిదు వేల మంది కూర్చుని తిలకించేవిధంగా నిర్మించిన సర్దార్‌ ‌వల్లభాయి పటేల్‌ ‌క్రికెట్‌ ‌స్టేడియంను ట్రంప్‌ ‌చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిపించేందుకు సన్నాహాలు జరుగుతు న్నాయి. అహమ్మదాబాద్‌ ‌విమానాశ్రయం నుండి క్రీడా ప్రాంగణంవరకు దాదాపుగా ఇరవై రెండు కిలోమీటర్లమేర బ్రహ్మాండమైన ప్రదర్శనకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ మార్గంలోనే ఉన్న ఓ మురికివాడను ఆయన కంటికి కనిపించకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతోం ది. ఇంతకూ ఆ మురికివాడను ఆగమేఘాల మీద అభివృద్ధి పరుస్తున్నారనుకుంటే పొరపాటే అవుతుంది. ట్రంప్‌ ‌వస్తున్న సందర్భంగా సుమారు వంద కోట్ల రూపాయలను వెచ్చిస్తున్న కేంద్రానికి, మురికి వాడలో నివసిస్తున్న మూడు వేలమంది నివాసాలను అందంగా తీర్చిదిద్దడం ఏమంత కష్టమైన పనికాదు. కాని, ఆ పేదవర్గాలను అలానే ఉండనిచ్చి, ట్రంప్‌కు కనువిందు చేసేందుకు వారిముఖాలు ఆయనకు కనిపించకుండా నాలుగువందల మీటర్ల పొడవున ఏడడుగుల ఎత్తున అడ్డంగా గోడకడుతున్నా రంటే, పేదరిక నిర్మూలనే తమ ధ్యేయమని ఎన్నికల ముందు ఉపన్యాసాలిచ్చి అధికారానికి వొస్తున్న ప్రభుత్వాల చిత్తశుద్ది ఏపాటిదో అర్థమవుతోంది.

ఇంతకీ ట్రంప్‌ అక్కడ పర్యటించేది కేవలం మూడు గంటలు మాత్రమే. అయినా ఇలాంటి ప్రక్రియ)నే గత ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి. అగ్రరాజ్య నేతలు వస్తున్నారంటేచాలు ఎక్కడలేని ఆంక్షలు విధించడం మనదేశంలో పరిపాటై ంది. గతంలో ఇలాగే బిక్షమెత్తుకునే వారిని బయటికి రాకుండా కొంతకాలంపాటు కట్టడిచేసిన విషయం తెలియందికాదు. ఇంతజేస్తే ట్రంప్‌ ‌పర్యటనతో భారదేశానికి ఏం లాభిస్తుందీ అనేకన్నా, అమెరికా తన వ్యాపార సామ్రా జ్యాన్ని విస్తరించుకోవడంలో భాగమే ఈ పర్యటనగా పేర్కొంటున్నారు. ఆయన రాకముందే వాణిజ్య ఒప్పం దాల ప్రక్రియ మొదలైంది. ఆయన పర్యటన సందర్భంగా భారత్‌లోని అగ్రస్థాయి పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ జరుగబోతోంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు మరింతగా పెరిగే అవ కాశాలున్నాయని చెబుతున్నారు. అగ్ర వ్యాపారవేత్తల్లో భారతీయ ఎయిర్‌టెల్‌ ‌చైర్మన్‌ ‌సునీల్‌ ‌భారతి మిట్టల్‌, ‌టాటా సన్స్ ‌చైర్మన్‌ ఎన్‌.‌చంద్రశేఖరన్‌, ‌మహీంద్రా గ్రూప్‌ ‌చై•ర్మన్‌ అనంద్‌ ‌మహేంద్రా, లార్సన్‌ అం‌డ్‌ ‌టూబ్రో చై•ర్మన్‌ ఏఎం ‌నాయక్‌, ‌బయోకాన్‌ ‌సిఎండి కిరణ్‌ ‌మంజుదార్‌ ‌షా లాంటి దిగ్గజాలు ఉండే అవకాశంఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం సందర్భంగా దావోస్‌లో భారత్‌, అమెరికా బృందాలు వాణిజ్యపరమైన చర్చలు జరిపాయి. ఆ తర్వాత కూడా చర్చలు కొనసాగాయి. ప్రధానంగా భారత్‌కు వైద్య పరికరాలను సరఫరా చేయడం, కమ్యూనికేషన్‌ ‌టెక్నాలజీ పరికరాలకు సంబంధించిన లావాదేవీలతోపాటుగా అమెరికా పాల ఉత్సత్తుల విక్రయంకోసం భారత్‌ ‌మార్కట్‌ ‌తెరవడం, అమెరికానుండి బాదాంను ఎక్కువగా ఎగుమతిచేసేయడం లాంటి విషయాల్లో ఓ అవగాహనకు వచ్చే అవకాశాలున్నాయనుకుంటు న్నారు. అయితే భారత్‌ ‌కూడా కొన్ని షరతులను అమెరికా ముందు పెట్టే అవకాశం లేకపోలేదు. భారత్‌కు చెందిన కొన్ని వస్తువులకు ఉన్న హోదాను అమెరికా గత ఏడాది రద్దు చేసింది. అదే క్రమంలో అమెరికాకు చెందిన పాల, వైద్య పరికరాలపై భారత్‌ ఆం‌క్షలు విధించింది. ఇప్పుడు పరస్పరం ఈ ఆంక్షలను ఎత్తివేసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలను అలా ఉంచితే ట్రంప్‌కోసం నిమిషానికి యాభై అయిదు లక్షల వరకు వెచ్చిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలోని మురికి వాడలపై కొంత్తైనా వెచ్చిస్తే నిరుపేదల బతుకులు బాగుపడేవనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.