Take a fresh look at your lifestyle.

నూతన విద్యా విధానానికి కొన్ని సూచనలు..

“ప్రధానంగా ప్రాధమిక విద్య మొత్తం మాతృభాషలోనే జరుగాలని, మాధ్యమిక విద్యనుండే వృత్తి నైపుణ్యాన్ని నేర్పాలన్న సూచన అభినందనీయమే. జపాన్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృభాషలోనే విద్యజరగడంవల్ల వారికి విషయాలపట్ల లోతైన అవగాహనఏర్పడి అది సృజన్మాకతకు దారితీసింది. అయితే ఇప్పుడు ఆంగ్లభాష అన్నది యూనివర్శల్‌ అయిందిగనుక, మనదేశంలో ఆంగ్లాన్ని కొనసాగిస్తూనే, అంటే లోతైన సాహిత్యంకాకుండా, ఆంగ్లలో మాట్లాడటం, రాయడవరకు పరిమితంచేసి, మాధ్యమిక, వీలైతే ఉన్నత విద్యవరకు మాతృభాషలో మిగతా సబ్జెక్టులను బోధించడంవల్ల విద్యార్దుల్లో సంబందిత విషయాలపట్ల సంపూర్ణ అవగాహన వచ్చే అవకాశాలున్నాయి. ఇక వృత్తి నైపుణ్యాల విషయాలకొస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాము.”

ప్రధాని నరేంద్రమోదీ కొత్తగా ప్రవేశపెట్టబోతున్న నూతన విద్యావిదానం-2020 నైపుణ్యానికి, పరిశోధనాత్మక విజ్ఞానానికి బాటలు వేసేలా ఉంది. అందుకే దేశంలోని రాష్ట్రాలేవీ ఈ విధానాన్ని పెద్దగా వ్యతిరేకిస్తున్నట్లు కనిపించడంలేదు. అయితే కొన్ని ప్రమాణాలు పాటించడంమాత్రం అత్యంతావశకతం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టినప్పుడే ఈ నూతన విద్యావిధానం విజయవంతమవుతుంది.  ప్రముఖ విద్యావేత్త అరిందం చౌదరి ఏఎస్‌కె అనే మూడు ఆంగ్ల అక్షరాను విషదీకరించిన విధానమిక్కడ గమనార్హం. ఏ ఫర్‌ అటిట్యూడ్‌ (‌దృక్పథం), ఎస్‌ ‌ఫర్‌ ‌స్కిల్‌ (అం‌టే నైపుణ్యం), కె ఫర్‌ ‌నాలెడ్జి (విజ్ఞానం)  ఈ మూడు విజయానికి సోపానమవుతాయని ఆయన తనపుస్తకంలో వివరించాడు. కాని, ఇంతకాలంగా మన విద్యావ్యవస్థ అందుకు భిన్నంగా కొనసాగుతూవచ్చింది. ఎక్కువ ప్రాధాన్యత విజ్ఞానానికి(థియరీకి), అంతకంటే తక్కువ ప్రాధాన్యత నైపుణ్యానికి, దానికన్నా మరీ తక్కువ ప్రాధాన్యత దృక్పథాని కిస్తూవచ్చింది. ఇలాంటి విద్యా వ్యవస్థ తయారుచేసిన పట్టభద్రులకు సరైన ఉపాధి అవకాశాలు అందుకే లభించకుండాపోతున్నాయి. ఒక వేళ ఉపాధి లభించినా తమపనిలో వారు రాణించలేకపోవడం గమనార్హం. వివిధ పరిశోధనలుకూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. తాజాగా కస్తూరి రంగన్‌ ‌నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యావిధానం మధ్య, ఉన్నత తరగతి విద్యార్దులకు ఉపయోగపడినంతగా, అరవై నుండి డెబ్బై శాతమున్న సాధారణ విద్యార్ధులకు ఉపయోగపడే అవకాశంలేదు. అలాఅని నూతన విద్యావిధానాన్ని మొత్తంగా కొట్టిపారేయలేము. ప్రధానంగా ప్రాధమిక విద్య మొత్తం మాతృభాషలోనే జరుగాలని, మాధ్యమిక విద్యనుండే వృత్తి నైపుణ్యాన్ని నేర్పాలన్న సూచన అభినందనీయమే.

జపాన్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృభాషలోనే విద్యజరగడంవల్ల వారికి విషయాలపట్ల లోతైన అవగాహనఏర్పడి అది సృజన్మాకతకు దారితీసింది. అయితే ఇప్పుడు ఆంగ్లభాష అన్నది యూనివర్శల్‌ అయిందిగనుక, మనదేశంలో ఆంగ్లాన్ని కొనసాగిస్తూనే, అంటే లోతైన సాహిత్యంకాకుండా, ఆంగ్లలో మాట్లాడటం, రాయడవరకు పరిమితంచేసి, మాధ్యమిక, వీలైతే ఉన్నత విద్యవరకు మాతృభాషలో మిగతా సబ్జెక్టులను బోధించడంవల్ల విద్యార్దుల్లో సంబందిత విషయాలపట్ల సంపూర్ణ అవగాహన వచ్చే అవకాశాలున్నాయి. ఇక వృత్తి నైపుణ్యాల విషయాలకొస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాము. వృత్తి నైపుణ్యాలను నేర్పే వసతులు దాదాపుగా ఏ పాఠశాలలో లేవనేచెప్పాలి. ఇప్పటికైనా ముందుగా వసతులు కల్పించి, ఉద్యోగావసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను మెరుగుపర్చాల్సినప్పుడే సార్థకత అవుతుంది. అయితే ఇక్కడ మరో విషయాన్ని గమనించాల్సిన అవసరముంది. ఏదో ఒక కోర్సులో చేరిన విద్యార్థి ఆ కోర్సుకు సంబందించిన అన్ని విషయాలను చదివినప్పుడే అతను పట్టభద్రుడవుతాడు. చదువుతున్న అన్ని విషయా)పట్ల అతనికి ఆసక్తిలేకపోయినా చదువక తప్పనిపరిస్థితి. దానివల్ల ఏదోఒక విషయంలోనే నిష్ణాతుడు లేదా ఇతర విషయాలపట్ల అవగాహన లేకుండాపోతోంది. ఇతరత్రా కోర్సులకు సంబందించిన విషయాలనుకూడా నేర్చుకోవడంద్వారా ఏ రంగంలోనైనా అతనికి ఉపాధి కలిగే అవకాశం ఏర్పడే విధంగా కొత్త విద్యావిధానంలో    మార్పులు తీసుకు రావాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అత్యంత వేగవంతంగా మారుతున్న ఉపాధిరంగ అవసరాలకు ఈ మార్పు ఎంతో దోహదపడుతుంది. పెరుగుతున్న సాంకేతికతను విద్యార్థి దశలోనే అందిపుచ్చుకుని, పలు ఆవిష్కర్ణలకు శ్రీకారంచుడుతున్నవారికి కోర్సు పూర్తిఅవ్వాలన్నది ప్రతిబంధంకాకూడదు.

పరిశోధనా రంగంలో ఎంఫిల్‌ ‌తీసివేయడంకూడా సరైన నిర్ణయంగానే భావించాలి. అలాగే పిహెచ్‌డిలను పదోన్నతులకు తప్పనిసరి చేయడంవల్ల నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయి. పరిశోధనల్లో సృజనాత్మక లోపిస్తున్నది. విస్తృత అధ్యయనాలు జరుగడంలేదు. ఫలితంగా పిహెచ్‌డీలు కేవలం సర్టిఫికట్లకే పరిమితమవుతున్నాయి. దేశప్రయోజనాలకు, ఉపాధిరంగాలకు, ఇతరత్రా అవసరాలకు తగినట్లుగా పరిశోధనలు జరుగడంలేదన్న వాదన చాలాకాంంగా వినిపిస్తూనేఉంది. కొందరిలో ప్రతిభ ఉండికూడా పిహెచ్‌డీలేని కారణంగా వారిసామర్ద్యాన్ని వినియోగించుకోలేక పోతున్నాం. అందుకు పిహెచ్‌డి ప్రధానంలో మ్యూంకనం విషయంలో ఒక గైడ్‌కే పరిమితంకాకుండా జాతీయ స్థాయిలో ఉత్పత్తి, పరిశోధనా రంగంలో నిపుణులు, శాస్త్రవేత్తలతోకూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయడం ద్వారా వివిధ రంగాల్లో  నైపుణ్యం, ప్రమాణాలతో కూడిన పరిశోధకులను తయారుచేసుకునే అవకాశమేర్పడుతుంది.
    మండువ హన్మంతప్రసాద్‌రావు
పాలిటెక్నిక్‌ ‌లెక్చరర్‌ (‌రిటైర్డ్ ‌హెచ్‌ఓడి)

Leave a Reply