సూర్యాపేట, మే 12, ప్రజాతంత్ర ప్రతినిధి): కరోనా కష్టకాలంలో నిరు పేదలకు, అనాథలకు తోచిన సహయం చేయడం అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్ డి. సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిధిలోని దురాజ్‌పల్లిలో గల ఆలేటి ఆటం వరల్డ్‌లో మానసిక వికలాం గులకు నిత్యావసర వస్తువులు, బియ్యం, పండ్లు, రొట్టెలు, కూరగాయలు, చిరుతిండ్ల వంటి వాటిని అందజేసి మాట్లాడారు. కరోనా వైరస్ నేపధ్యంలో విధించిన లాక్డౌన్లో అనాథాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరి కృపాకర్, పోలెబోయిన నర్సయ్య యాదవుల ఆర్థిక సహకారంతో వికలాంగులకు నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా దాత లను అభినందించారు.
అనంతరం గండూరి కృపాకర్ మాట్లాడుతు మంత్రి జగదీష్‌రెడ్డి సూచనల మేరకు కష్టకాలంలో ఎంతో మందికి సహయం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కరువు బారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనాథాలకు ఈ విధంగా సేవ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులు నూకల వెంకటరెడ్డి, పెండెం చంద్రశేఖర్, పటేల్ నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, సుధాకర్, సాలయ్య, బిక్షం తదితరులు పాల్గొన్నారు.