Take a fresh look at your lifestyle.

‌ప్రార్థించే పెదాల కన్నా… సాయం చేసే చేతులు మిన్న

జన్నారం, మే 16, ప్రజాతంత్ర విలేఖరి : కరోనా నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌విధించడంతో ఎంతో మంది నిరుపేదలు ఆకలి అ)మటిస్తున్నారని కలెక్టర్‌ ‌భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం రోజున మండలంలోని గిరిజన గ్రామమైన దొంగపల్లి గ్రామంలో మంచిర్యాల జిల్లా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (టిఆర్‌ఈఎస్‌ఎ) ఆధ్వర్యంలో కలెక్టర్‌ ‌చేతుల మీదుగా 60 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ ప్రార్థించే పెదాల కన్నా… సాయం చేసే చేతుల మిన్నా. ఆపదలో ఉన్న నిరుపేలను ఆదుకోవడా నికి ముందుకు వచ్చిన రెవెన్యూ ఉద్యోగులను అభినందించారు. పనులు లేక రెక్కాడితేగాని డొక్కాడని పేద ప్రజలను ఆదుకోవడానికి దాతలు పెద్ద మనసుతో ముందుకు రావాలని కోరారు. ఎవరైనా గ్రామాలకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చినట్లయితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. జన్నారం మండలానికి ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 500 మంది వరకు వచ్చారని, వచ్చిన వారు 28 రోజులు హోమ్‌ ‌క్వారంటైన్‌లోనే ఉండాలని, కాదని నిబంధనలను ఉల్లంఘించి బయట తిరిగినట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా నివారణలో పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు, వైద్య సిబ్బంది రేయింబవళ్లు కష్టపడుతున్నారని, మీరుకూ•డా వారికి సహకరించి భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి బయటికి వెళ్లాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఈఎస్‌ఎ ‌జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రావు దేశ్‌ ‌పాండే, కార్యదర్శి ఎల్‌.‌కృష్ణ, కలెక్టర్‌ ‌కార్యాలయ సూపరిండెంట్లు మల్లికార్జున్‌, శ్రీ‌నివాస్‌, ‌నాయకులు గడియారపు శ్రీహరి, కె.శ్రీనివాస్‌, ‌వీఆర్‌వోల సంఘం జిల్లా అధ్యక్షులు ఎసయ్య, ఎంపిడివో అరుణ రాణి, దండపల్లి, జన్నారం తాహసీల్దార్‌లు సంతోష్‌ ‌కుమార్‌, ‌రాజ్‌ ‌కుమార్‌, ‌నాయాబ్‌ ‌తాహసీల్దార్‌ ‌నవీన్‌ ‌కుమార్‌, ఎఫ్‌ఆర్‌వో వెంకటేశ్వర్‌రావు, మల్యాల గ్రామ సర్పంచ్‌ ‌హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

సానిటైజర్‌ ‌తీసుకునే పరికరంతో వైరస్‌ ‌వ్యాప్తి మరింత కట్టడి
మందమర్రి : కోవిడ్‌ -19 (‌కరోనా) వైరస్‌ ‌నియంత్రణ కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం విద్యార్థులు చేతితో తాకకుండా సానిటైజర్‌ ‌తీసుకునే విధంగా పరికరాన్ని తయారు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ‌భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ‌భవన సముదాయంలోని కలెక్టర్‌ ‌చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్‌ ‌కుమార్‌ ‌దీపక్‌తో కలిసి విద్యార్థులు తయారుచేసి పరికరాన్ని ప్రారంభించి సానిటైజర్‌ ‌యంత్రం పనితీరును పరిశీలించి పలు మార్పులు చేయవల్సిందిగా విద్యార్థులకు సూచ నలు చేశారు. ఉద్యోగులకు, సిబ్బంది, సందర్శకులు వినియోగించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చేతితో తాకకుండా సానిటై జర్‌ ‌చేతిలోకి తీసుకోవడంతో వైరస్‌ ‌వ్యాప్తిని మరింతగా నియంత్రించవచ్చని, పరికరం తయారీలో విద్యార్థులను ప్రోత్సహించినట్లు ప్రిన్సిపల్‌ ‌చందర్‌ ‌తెలిపారు. ఎవరికైనా పరికరం కావాలనుకుంటే సామాగ్రి వ్యయం చెల్లిస్తే అతి తక్కువ వ్యయంతో తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, జిల్లా పంచాయితీ అధికారి వీరబుచ్చయ్య, డిటిఓలు శ్రీధర్‌రాజు, ప్రకాష్‌, ‌హఫీజ్‌, ‌మున్వర్‌పాషా, వెంకటేశ్వర్లు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply