Take a fresh look at your lifestyle.

తెలుగు మత్స్యకారులను ఆదుకోండి

  • గుజరాత్‌ ‌సిఎం రూపానికి జగన్‌ ‌ఫోన్‌
  • ‌గుజరాత్‌లో 2వేలు దాటిన కొరోనా కేసులు

‌గుజరాత్‌ ‌సీఎం విజయ్‌ ‌రూపానీకి ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ ‌చేశారు. గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని కోరారు. సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌విజ్ఞప్తిపై గుజరాత్‌ ‌సీఎం విజయ్‌రూపానీ సానుకూలంగా స్పందించారు. తెలుగువారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హా ఇచ్చారు. ఇదిలావుంటే గుజరాత్‌లో కరోనా కేసుల సంఖ్య రెండువేలు దాటింది.

రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 127 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2066కు చేరింది. గుజరాత్‌లో కరోనా కేసుల సంఖ్య గత శుక్రవారం వెయ్యి దాటింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో మరో వెయ్యి కేసులు నమోదు కావడం గమనార్హం. కొత్తగా నమోదైన 127 కేసుల్లో సూరత్‌కు చెందిన 69 మంది ఉండగా, అహ్మదాబాద్‌కు చెందినవారు 50 మంది ఉందారు. రాష్ట్రంలో ఈ వైరస్‌ ‌వల్ల ఇప్పటివరకు 77 మంది మరణించారు.

Leave a Reply