హుస్నాబాద్: పొట్టకూటి కోసం గీత వృత్తి లో భాగంగా తాటిచెట్టు ఎక్కి కల్లు దిగుమతి చేసి నాలుగు పైసల ఆదాయంతో కుటుం బాన్ని పోశించుకుందామను కుంటే విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు చెట్టుపైనుంచి పడి జీవఛ్చవంగా మారిన తన భర్తను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోందీ ఓ ఇల్లాలు. అక్కన్నపేట మండలం మంచినీల్లబండ గ్రామానికి చెందిన బుర్ర సదయ్య అలియాస్ తీగల సదానందం సుమారు రెండు నెలల క్రితం తాటిచెట్టుపైనుంచి పడి తొంటి విరిగిపోయింది.తన భార్య లావణ్య కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి శస్త్రచికిత్స చేయించింది.
అప్పటికే కూతురు పెండ్లికోసం రూ.3లక్షలు అప్పు తెచ్చి వివాహం చేశారు.ఇంతలోనే ఈ ప్రమాదం వాటిల్లగా భర్త బాగుకోసం మరో రూ.1.5అక్షలు అప్పు తెచ్చి వైద్యం చేయించానని,అయినా అప్పటినుంచి నేటికీ భర్త ఆరోగ్యం కోలుకోవడం లేదనీ,తెచ్చిన అప్పులు తడిసి మోపెడయ్యాయ నీ భార్య లావణ్య కన్నీరు మున్నీరవుతోంది.ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారనీ కుటుంబాన్ని పోషించే భర్త మంచానపడగా పస్తులుంటున్నామనీ ప్రభుత్వం తమ కుటుంబానికి సాయమందించాలని లావణ్య వేడుకుంటోంది.