Take a fresh look at your lifestyle.

నిరుపేదలకు సాయం.. సిఎం సహాయ నిధి : మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ఆగస్టు 9 (ప్రజాతంత్ర బ్యూరో): ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు పేర్కొన్నారు.  సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 09 మంది లబ్ధిదారులకు రూ.2 లక్షల 51 వేల 500 రూపాయల మేర సిఎంఆర్‌ఎఫ్‌ ‌చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు సాయం.. పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్ధిపేట నియోజకవర్గమే నిదర్శనమని మంత్రి చెప్పారు.

చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ‌మాజీ ఛైర్మన్‌ ‌రాజనర్సు, మార్కెట్‌ ‌కమిటీ ఛైర్మన్‌  ‌పాలసాయిరాం, సుడా చైర్మన్‌ ‌రవీందర్‌ ‌రెడ్డి, పలువురు మునిసిపల్‌ ‌కౌన్సిలర్లు, నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామ ప్రజాప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply