Take a fresh look at your lifestyle.

తప్పనిసరిగా హెల్మెట్‌ ‌ధరించాలి

Head Constable No, Constable Ramakrishna, Prithvi

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ‌ధరించాలని, ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఎస్‌ఐ ‌బి బాలకృష్ణ అన్నారు.సోమవారం మండల కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆయన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వం జిల్లా పరిషత్‌ ‌పాఠశాల నుండి మండల కేంద్రం వరకు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో విద్యార్థులతో మానవహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పాటించాలని కోరారు.

- Advertisement -

నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని సూచించారు. ద్విచక్ర వాహనంపై త్రిబుల్‌ ‌రైడింగ్‌ ‌చేయకూడదని, మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణం అవుతుంది కాబట్టి లిమిట్‌ ‌స్పీడులో వాహనాలను నడపాలని పేర్కొన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌నాగయ్య, కానిస్టేబుల్‌ ‌రామకృష్ణ, పృథ్వి, పాల్గొన్నారు.

Tags: Helmet upholstery, certificates,road safety,Head Constable No, Constable Ramakrishna, Prithvi

Leave a Reply