వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు, వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని మన్నెగూడ, ఇతర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో మామిడి పంట భారీగా రాలిపోయింది. ఇప్పటికే లాక్ డౌన్‌తో దిక్కుతోచని స్థితిలో ఉండి, ఇంతకాలం పంటను కాపాడుకుంటూ వచ్చిన మామిది పంట నేల పాలు కావడంతో రైతులు భారీగా నష్టపోయి ఆందోళనలో పడ్డారు.