Take a fresh look at your lifestyle.

గండిపేటకు భారీగా నీరు

అవసరాన్ని బట్టి గేట్లు ఎత్తుతామన్న అధికారులు

వరుసగా కురుస్తున్న వర్షాలకు గండిపేటలోకి కూడా నీరు చేరుతోంది. ..హిమాయత్‌సాగర్‌ ‌జలాశయం నుంచి 2 గేట్లు ద్వారా వరదనీరు మూసీకి చేరుతుండగా గండిపేట జలాశయం కూడా నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 కాగా, ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 1786 అడుగులుగా ఉంది. మరో రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగితే గేట్లు ఎత్తి వేసి.. నీటిని దిగువకు వదులుతారు. ఈ మేరకు జలమండలి, రెవెన్యూ, పోలీస్‌, ఇరిగేషన్‌శాఖ అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధమైయ్యారు. గండిపేట దిగువ ప్రాంతంలోని తహశీల్దార్‌, ‌మునిసిపల్‌ అధికారులకు సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌కు రెవెన్యూ అధికారులు సమాచారం అందించారు.

గండిపేట పరీవాహక ప్రాంతంలో వర్షం పడుతున్నందున  లెవెల్‌ ఒక్కసారి సరిచూసుకొని అవసరమైతే  నాడు గేట్లు ఎత్తుతామని జలమండలి అధికారులు తెలియజేశారు. గండిపేట జలాశయానికి మొత్తం 15 గేట్లు ఉన్నాయి. గేట్లు తెరిస్తే గండిపేట మండలంలోని ఒక్క మంచిరేవుల గ్రామానికి రాకపోకలు నిలిచిపోనున్నాయి. మంచిరేవుల గ్రామస్తులు నార్సింగ్‌ ‌తదితర గండిపేట ప్రాంతాలకు రావాలంటే చుట్టూ తిరిగి బండ్లగూడా నుంచి రావాల్సి ఉంటుంది. లేదా ఔటర్‌ ‌రింగ్‌రోడ్డును అప్పాదగ్గరికి రావాల్సి ఉంటుం ది. మంచిరేవుల గ్రామం పరిధిలోని పాతగ్రామంతో పాటు నాలుగు కాలనీలకు రాకపోకలు నిలిచిపోవడం ఖాయం. వీరంతా అప్పా నుంచి రాకపోకలు సాగించాల్సిందే. కాగా గండిపేట జలాశయానికి చివరికిసారిగా 2010లో గేట్లు ఎత్తివేశారు.

Leave a Reply