Take a fresh look at your lifestyle.

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

  • సముద్రాన్ని తలపిస్తున్న రోడ్లు
  • రెడ్‌ అలర్ట్ ‌ప్రకటించిన ఐఎండి

భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలో రెడ్‌ అలర్ట్ ‌ప్రకటించారు. గత రెండు రోజులుగా..ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరం…మరో సముద్రాన్ని తలసిస్తోంది. వరద నీరుపూర్తిగా రోడ్లపై చేరడంతో జనజీవనం, రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. దీంతో ముంబై ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చెంబూర్‌, ‌పరేల్‌, ‌హింద్మాత, వడాలా సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ముంబై నగరంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్‌ అలర్ట్ ‌ప్రకటించింది. మరో రెండు రోజులు పాటు ఇదే రీతిలో భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

భారీ వర్షాల నేపథ్యంలో.. హార్బర్‌ ‌లైన్‌లోని సీఎస్‌ఎం‌టీ స్టేషన్లు, మెయిన్‌ ‌లైన్‌లోని సీఎస్‌ఎం‌టీ కుర్లా, చర్చ్‌గేట్‌-‌కుర్లా స్టేషన్ల మధ్య సబ్‌ అర్బన్‌ ‌రైళ్లను నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు రైల్వే స్టేషన్లు వరద నీట మునిగాయి. వర్షం నీరు నిలిచి పోవటంతో మసీదు-భయ్‌ఖలా స్టేషన్ల మధ్య రెండు రైళ్లు చిక్కుకుపోయాయి. ఆ ప్రదేశానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు చేరుకొని పడవల సాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  వర్షాలు తగ్గకపోవడంతో…2005 లో వరదలు సంభవించిన సమయంలో చోటుచేసుకున్నట్లుగానే… భారీ ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచిస్తూ… అధికారులు రెడ్‌ అలర్ట్ ‌హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply