Take a fresh look at your lifestyle.

వాయుగుండం ప్రభావంతో.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక వర్షపాతం
హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం జంట నగరాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

ఖమ్మంజిల్లా వేంసూరులో 18.7 సెం.వి•, సత్తుపల్లిలో 14.7 సెం.వి•, సదాశివునిపాలెంలో14 సెం.వి• వర్షపాతం నమోదైంది. భదాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లంలో 15.5 సెం.వి•, దమ్మపేట మండలం అంకంపాలెంలో 12 సెం.వి•, చంద్రుగొండ మండలం మద్దుకూరులో 12సెం.వి•, ములకలపల్లిలో 11.6 సెం.వి• వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జోరువాన కురుస్తోంది. పలు జిల్లాలో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌సూచించారు. మరోవైపు భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. నది పరీహవాక ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతోంది.

Leave a Reply