Take a fresh look at your lifestyle.

తమిళనాడును వీడని వర్షాలు

  • వాయుగుండంతో ప్రభుత్వం అప్రమత్తం
  • లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక
  • అవసరమైతేనే బయటకు రావాలని సూచన

చెన్నై,నవంబర్‌11: ‌వాయుగుండం ప్రభావంతో తమిళనాడు అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం ఇంకా కుదట పడలేదు. లోతట్టు ప్రాంతాల్లో ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. దీంతో సర్కార్‌ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.. చెన్నై నగరంలో ఉన్న అన్ని సబ్‌వేలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు రోజులపాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.. ప్రజలు ఎవరు బయటికి రావొద్దని సూచించారు. ఇక, లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్‌ ‌సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు.  చెన్నైకి 170 కిలోటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.. సాయంత్రానికి మహాబలిపురం, చెన్నై సపంలో వాయుగుండం తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వాయుగుండం ప్రభావంతో.. రానున్న నాలుగు గంటల్లో చెన్నై, తిరువల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి గంటకు 50 కిలోటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు.. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అత్యధికంగా తాంబరంలో 23 సెంటీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఎన్నూరులో 20, చోళవరంలో 20, నుంగంబాకంలో 16 సెంటీ టర్ల వర్షపాతం నమోదైంది. మూడు రోజులుగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నప్పటికీ చెన్నై నగరంలో మరీ పల్లపు ప్రాంతాలుగా ఉన్న 150 వీధులు ఇంకా జలదిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. అంబత్తూరు, కొరట్టూరు, కొళత్తూరు, కల్లికుప్పం, కరుక్కుమేనాంబేడు, భానునగర్‌ 20‌వ అవెన్యూ నుంచి 30 అవెన్యూ వరకు ఉన్న వీధుల్లో మూడు రోజులుగా వర్షపు నీరు వరదలా ప్రవహిస్తూనే ఉంది. అశోక్‌నగర్‌లోని ఇందిరానగర్‌, ‌తరమణి, దురైపాక్కం, మేట్టుకుప్పం ప్రాంతాల్లో అడుగు లోతున వర్షపునీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

నగరం నడిబొడ్డున ఉన్న టి.నగర్‌ ‌జీఎన్‌ ‌చెట్టి రోడ్డు, కోడంబాక్కం రాజమన్నార్‌ ‌రోడ్డు, సాలిగ్రామం అరుణాచలం రోడ్డు, మాధవరం పొన్నియమ్మన్‌మేడు, రెట్టేరి శివగణపతి నగర్‌, శ్రీ‌దేవి నగర్‌, ‌తిరువొత్తియూరు  వ్యాసార్పాడి, అంబత్తూరు ఎస్టేట్‌ ఎక్స్‌టెన్షన్‌ ‌ప్రాంతాల్లో ఇంకా వరద దృశ్యాలే కొనసాగుతున్నాయి.

Leave a Reply