Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో దంచికొడుతున్న వర్షాలు

పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వాన

తెలంగాణ రాష్రాన్ని వరుణుడు వీడటం లేదు. గత పదిహేను రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లలో రెడ్‌ అలర్ట్ ‌కొనసాగుతుంది. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా తీరప్రాంతం, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, ‌పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ‌మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. దీంతో వచ్చే రెండు మూడు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ‌విదర్భ, గుజరాత్‌, ‌కొంకణ్‌ , ‌గోవా, మధ్య మహారాష్ట్ర, తెలంగాణ , ఆంధప్రదేశ్‌ ‌లోని తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే సోమవారం అనేక జిల్లాల్లో వర్షం కురిసింది.

అయితే మంగళ, బుధవారాల్లో కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, ‌కొమురం భీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల్‌, ‌నిర్మల్‌ ‌జిల్లాల్లో ఆరంజ్‌ అలర్ట్ ‌ప్రకటించిన వాతావరణ శాఖ నిజామాబాద్‌, ‌జగిత్యాల్‌, ‌రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, సిద్దిపేట్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నారాయణపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ‌జారీ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురియగా.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులపైకి నీరుచేరి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. మరోవైపు బధవారం కూడా భాగ్యనగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకొని కొనసాగుతు వాయువ్య దిశగా తీవ్ర అల్పపీడనం పయనిప్తుంది.

Leave a Reply