Take a fresh look at your lifestyle.

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు

  • జపజీవనం అస్తవ్యస్తం
  • జలదిగ్బంధంలో పలు పట్టణాలు
  • నిండు కుండల్లా ప్రాజెక్టులు, చెరువులు
  • పొంగుతున్న వాగులు వంకలు
  • నీట మునిగిన సిరిసిల్ల పట్టణం..అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి కెటిఆర్‌
  • ‌వరంగల్‌ ‌జిల్లాలో రెడ్‌ అలెర్ట్..‌భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తం  
  • భారీ వర్షాలకు కరీంనగర్‌ ‌జలమయం…గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు
  • నిజామబాద్‌ ‌జిల్లాలో భారీ వర్ష హెచ్చరికలతో ప్రాజెక్టు అధికారుల అప్రమత్తం
  • ఏడుపాయల వద్ద మంజీరా ఉధృతి..ఆలయం మూసివేత
  • నిర్మల్‌ ‌జిల్లాలో మరోమారు భారీ వర్షాలు..భైంసాలో అత్యధిక వర్షపాతం
  • జమ్మికుంటలో నీట మునిగిన కాలనీ

రాష్ట్రంలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. పలు పట్టణాలు, కాలనీలు, గ్రామాలు జలమయం అయ్యాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లడంతో రహదారులు తెగిపోయాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి…జనజీవనం స్తంభించి పోయింది. సిరిసిల్ల పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణంలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుంది. కరీంనగర్‌ ‌నగరంలో ప్రధాన రహదారిపైకి వరద నీరు వొచ్చి చేరింది. జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌నిర్మల్‌, ఆదిలాబాద్‌ ‌తదితర జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. వరంగల్‌ ‌జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగులు పారుతూ రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్ధన్నపేటలోని ఆకేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్‌-‌ఖమ్మం జాతీయ రహదారిపై వరదనీరు భారీగా ప్రవహిస్తుండటంతో పంతిని వద్ద నీటి ప్రవాహంలో ఓ లారీ చిక్కుకుంది. ఉప్పరపల్లి చెరువు ఉప్పొంగడంతో అటుగా వెళ్లే రోడ్డు పూర్తిగా వరదముంపులో ఉండిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోని పంటపోలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీటమునిగాయి. జగిత్యాల జిల్లాలోనూ సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. లో లెవెల్‌ ‌బ్రిడ్జిల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పలుచోట్ల రోడ్డు దెబ్బతినడంతో జగిత్యాల-ధర్మారం, జగిత్యాల-ధర్మపురం, జగిత్యాల-పెగడపల్లి, రాయికల్‌-‌కోరుట్ల, వేములవాడ-కోరుట్ల మార్గాలను అధికారులు మూసివేశారు. ఆ మార్గాల్లో వెళ్లేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు సూచించారు.

 

నీట మునిగిన సిరిసిల్ల పట్టణం..అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి కెటిఆర్‌

‌సిరిసిల్ల పట్టణంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురియడంతో వరద పోటెత్తి పట్టణం అంతా జలమయం అయ్యింది.  పలు కాలనీల్లో వరద నీరు వొచ్చి చేరింది. పట్టణంలో వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, మున్సిపల్‌ ‌కమిషనర్‌లతో మంత్రి కేటీఆర్‌ ‌టెలీకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు వొచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద ముంపునకు గురైన ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు.

Heavy rains in several districts across the state

సహాయక చర్యల కోసం హైదరాబాద్‌ ‌నుంచి డీఆర్‌ఎఫ్‌ ‌బృందాన్ని పంపిస్తున్నామని తెలిపారు. సిరిసిల్లలోని పలు కాలనీలో వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మోకాళ్ల లోతుకు పైగానే వరద ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని కాలనీల్లో కార్లు కూడా వరద ప్రవాహనికి కొట్టుకుపోయాయి. పాతబస్టాండ్‌, ‌ప్రగతి నగర్‌, ‌సాయినగర్‌, ‌వెంకంపేట, శాంతి నగర్‌, ‌పద్మానగర్‌ ఏరియాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. అంబికానగర్‌, ‌శాంతి నగర్‌, ‌గాంధీనగర్‌లో వరద పోటెత్తింది. పెద్ద బజార్‌, అం‌బేద్కర్‌ ‌నగర్‌ ‌ప్రాంతాలు జలమయం అయ్యాయి. సహాయక చర్యల కోసం కలెక్టర్‌ అనురాగ్‌ ‌జయంతి అధికారులను అప్రమత్తం చేశారు. 24 గంటలూ అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు,వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నెంబర్‌ 9100069040 ఏర్పాటు చేశారు.

 

వరంగల్‌ ‌జిల్లాలో రెడ్‌ అలెర్ట్..‌భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తం      

వరంగల్‌ ‌జిల్లాలో వర్షాల నేపథ్యంలో అధికారులు రెడ్‌ అలెర్ట్ ‌ప్రకటించారు. నడికుడ మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. రెడ్‌, ఆరెంజ్‌ అలెర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది. కలెక్టర్లు, పోలీసులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వరంగల్‌, ‌హన్మకొండ కలెక్టరేట్‌లలో టోల్‌ ‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. వరంగల్‌ ‌టోల్‌ ‌ఫ్రీ నంబర్‌ 1800 425 3424 ‌కాగా.. హన్మకొండలో టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌ 1800 425 1115‌గా ప్రకటించారు. ఇదిలావుంటే ఆత్మకూరు మండలం, పసరగొండ గ్రామంలో ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి కొట్టుకుపోతున్న స్కూల్‌ ‌పిల్లలను గ్రామస్థులు కాపాడారు. పసరగొండ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు పిల్లలు స్కూల్‌ ‌నుంచి ఇంటికి వొస్తుండగా భారీ వర్షం కురిసింది. లోలెవల్‌ ‌వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండగా దాన్ని దాటేందుకు ముగ్గురు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో వారు వరద నీటిలో కొట్టుకుపోగా పక్కనే ఉన్న పొదల్లో చిక్కుకుపోయి కేకలు వేశారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని కాపాడారు. వరంగల్‌ ‌జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగులు పారుతూ రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్ధన్నపేట లోని ఆకేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్‌-‌ఖమ్మం జాతీయ రహదారిపై వరదనీరు భారీగా ప్రవహిస్తుండటంతో పంతిని వద్ద నీటి ప్రవాహంలో ఓ లారీ చిక్కుకుంది. ఉప్పరపల్లి చెరువు ఉప్పొంగడంతో అటుగా వెళ్లే రోడ్డు పూర్తిగా వరదముంపులో ఉండిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోని పంటపోలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీటమునిగాయి.

 

భారీ వర్షాలకు కరీంనగర్‌ ‌జలమయం…వేములకుర్తి వద్ద గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు

భారీ వర్షాలతో కరీంనగర్‌ ‌పట్టణం జలమయం అయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్‌, ‌కరీంనగర్‌ ‌మేయర్‌ ‌సునీల్‌ ‌రావు పర్యటించారు. మంగళవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 15.31 సెంటీ వి•టర్ల వర్ష పాతం నమోదు అయ్యింది. జిల్లాలోని మానేరు, మోయతుమ్మెద, చిలుక, శంకరపట్నం, ఇరుకుల్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాల్లో ఇండ్లలోకి వరద నీరు వొచ్చి చేరింది. చెరువులు, కుంటల్లోకి భారీ వరద వొచ్చి చేరుతుంది. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. పలు మండలాల్లో పంట పొలాలు నీట మునిగిగాయి. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌పాఠశాలలకు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ‌మంగళవారం సెలవు ప్రకటించారు. ఎల్‌ఎం‌డీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్‌లోకి ఇన్‌ ‌ఫ్లో భారీగా వొచ్చి చేరుతుంది.

Heavy rains in several districts across the state

దీంతో ఇరిగేషన్‌ అధికారులు 18 గేట్ల ద్వారా లక్షా 76 వేల 706 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్‌ఎం‌డీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మోయ తుమ్మెద వాగు నుంచి 69వేల 278 క్యూసెక్కులు, మిడ్‌ ‌మానేరు నుంచి లక్షా 7 వేల 433 క్యూసెక్కులు, ఇతర క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి 300 క్యూసెక్కుల నీరు మొత్తం లక్షా 77 వేల 011 క్యూసెక్కుల నీరు ఇన్‌ ‌ప్లో రూపంలో రిజర్వాయర్‌కు వొస్తుంది. జగిత్యాల జిల్లా  ఇబ్రహీమ్‌పట్నం మండలం వేములకుర్తి వద్ద గోదావరిలో ముగ్గురు గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. బస సోమన్న, అలకుంట లసమన్న, నేమురి చిన్న ఆశన్నగా గుర్తించారు. 4 రోజులుగా గొర్రెలు కాయడానికి ముగ్గురు కాపరులు వెళుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీరామ్‌ ‌సాగర్‌ ‌నీరు వదలడంతో గోదావరిలో గొర్రె కాపరులు చిక్కుకుపోయారు. కుటుంబ సభ్యులు విషయాన్ని అధికారులకు చేరవేశారు.

 

నిజామబాద్‌ ‌జిల్లాలో భారీ వర్ష హెచ్చరికలతో ప్రాజెక్టు అధికారుల అప్రమత్తం

నిజామాబాద్‌లో రోజంతా భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో యంత్రాంగం, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. మంగళవారం అన్ని విద్యా సంస్థలకు లోకల్‌ ‌హాలిడే ప్రకటించారు. సెల్‌ ‌కాన్ఫరెన్స్ ‌ద్వారా అధికారులకు జిల్లా కలెక్టర్‌ ‌నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల రక్షణ చాలా ముఖ్యమని..ప్రతి అధికారి హెడ్‌ ‌క్వార్టర్‌లో ఉండాలన్నారు. ఫిర్యాదులకు వెంటనే స్పందించి పరిష్కారించాలని సూచించారు. పోచంపాడు, నిజాం సాగర్‌ ‌ప్రాజెక్టుల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ‌సూచించారు.

Heavy rains in several districts across the state

నిజాంసాగర్‌ ‌ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. కామారెడ్డి: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయం కాగా, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు వొచ్చి చేరింది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ ‌లక్ష్మీనరసింహ స్వామి గర్భగుడిలోకి వర్షపు నీరు చేరింది. మాచారెడ్డి మండలం నెమిలి గుట్ట తండాలో వరి పంట నీట మునిగింది. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని పిట్లం-బాన్సువాడ మధ్యలో రాంపూర్‌ ‌వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయమేర్పడుతుంది.

 

ఏడుపాయల వద్ద మంజీరా ఉధృతి..ఆలయం మూసివేత

మెదక్‌ ‌జిల్లాలోని పాపన్నపేట మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు ఆలయాన్ని మూసివేశారు. రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహానికి నిత్య పూజలు నిర్వహించనున్నారు. ఎడతెరపకుండా కురుస్తున్న వర్షాలకు ఘనపూర్‌ ‌ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది. సింగూరు నుండి దిగువకు నీరు విడుదలడంతో ఆలయంలోకి వరద వచ్చే అవకాశం ఉండడంతో మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 

నిర్మల్‌ ‌జిల్లాలో మరోమారు భారీ వర్షాలు..భైంసాలో అత్యధిక వర్షపాతం

నిర్మల్‌ ‌జిల్లాను మరోమారు వర్షం ముంచెత్తింది. సోమవారం రాత్రి నుండి ఎడతెరిపిలేకుండా వర్షంతో బైంసా పట్టణంలో 164.8 వి•.వి•తో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. పట్టణంలోని పలు కాలనీలు, కూడళ్లలో రోడ్లన్నీ జలమయం కాగా, పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ‌బడి నీటితో నిండి స్విమ్మింగ్‌ ‌పూల్‌గా మారింది. బైంసా మండలంలోని గుండెగాం పూర్తిగా నీటితో నిండిపోయింది. గ్రామంలోని ఇళ్లన్నీ నీటితో నిండిపోయాయి. బైంసా డివిజన్‌ ‌వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు గడ్డెన్నవాగు ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. దీంతో సోమవారం రాత్రి ఆరు గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలారు.ఇన్‌ ‌ఫ్లో 79,452 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. ఔట్‌ ‌ఫ్లో 79,452 క్యూసెక్కుల నీటిని వదిలారు. దిగువకు నీటిని వదలడంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా వుండాలని, అంతేకాకుండా రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని తెలియజేశారు. ఇప్పటికే తాలూకాలోని పలు ఇండ్లు, కాలనీలు జలమయం అయ్యాయి. జూలై నెలలో పడిన వర్షాలకు పంట నష్టపోగా తాజాగా పండగ ముందు ఇంటికి వొచ్చే ధాన్యం కూడా నష్ట పోతున్నామని  రైతులు ఆవేదన వ్యక్థం చేస్తున్నారు. మినుము, కంది, పత్తి ఇప్పటికే నేలకు ఒరిగాయని కొందరు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

జమ్మికుంటలో నీట మునిగిన కాలనీ

భారీ వర్షాలతో కరీంనగర్‌ ‌జిల్లాలో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. జమ్మికుంట పట్టణంలో భారీ వర్షాలకు హౌసింగ్‌ ‌బోర్డు కాలనీ నీట మునిగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ‌కాలనినీ సందర్శించారు. నీట మునిగిన ఇండ్లలోకి స్వయంగా వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద నీటికి తడిసి ముద్దయిన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్‌ ‌సామాగ్రిని పరిశీలించారు. కాలనీ వాసులకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్‌ ‌చేశారు.మరోవైపు హుస్నాబాద్‌లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారిపై వరదనీరు చేరింది. అంబేడ్కర్‌ ‌చౌరస్తా, నాగారం రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు పలు వీధులు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షం ప్రభావంతో జమ్మికుంట నుంచి కోరపల్లికి వెళ్లేదారిలో విద్యుత్‌ ‌స్తంభాలు విరిగిపడ్డాయి. ఆ ప్రాంతంలో పలుచోట్ల వరదనీరు పంటపొలాల్లోకి చేరడంతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.

Leave a Reply