Take a fresh look at your lifestyle.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు

నిండిన జలాశయాలు… ప్రవహిస్తున్న వాగులు,వంకలు
తెరిచిన మిడ్‌మానేర్‌ ‌గేట్లు…
మత్తడి దూకుతున్న ఎగువ మానేరు
సిరిసిల్ల, జులై 22,(ప్రజాతంత్ర ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా బుధవారం రాత్రి నుండి గురువారం రాత్రి వరకు వర్షం కురుస్తుండటంతో జన జీవనం అతలాకుత)మైంది.జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో భారీ వర్షం కురియడంతో జిల్లా సగటు వర్షపాతం 73.9 మిల్లీమీటర్లు గా నమోదైంది.ఈ వర్షాలతో జిల్లాలోని అన్ని వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తుండగా ఎగువ మానేరు నిండి మత్తడి ఉదృతంగా దూకుతూ సిరిసిల్ల వరకు మానేరు వాగు నిండుగా ప్రవహిస్తుంది.కోనరావుపేట మండలం,వీర్నపల్లి మండలంలోని వాగులు ప్రవహించి నిమ్మపల్లి చెరువు పూర్తిగా నిండటంతో మత్తడి దూకడంతో పాటు చందుర్తి మండలంలోని వాగులు,ఒర్రెలు ప్రవహించడంతో వేములవాడ పక్కనేగల మూలవాగు ప్రవహిస్తుంది.ఈ మూలవాగు ప్రవాహంతో మల్లారం మాటు నుండి వేములవాడ చెరువులోకి నీరు చేరుతుంది.సిరిసిల్ల,వాగు,వేములవాడ వాగు నీరంతా మిడ్‌మానేరులోకి ప్రవహిస్తుండటంతో మిడ్‌మానేరు సైతం పూర్తిగా నిండే అవకాశం ఉంది.

ఈ మిడ్‌మానేరు పూర్తి నీటి సామర్థ్యం 27.5 టిఎంసిలు కాగా ఇప్పటికే 25.5 టిఎంసిల నీరు చేరింది.దీనికి తోడుగా ఎగువ ప్రాంతాలనుండి 82 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో 22 గేట్లు ఎత్తి 1లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ వర్షంతో జిల్లాలోని పలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌ ‌క్షేత్రస్థాయిలో పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.ఇదే సమయంలో జిల్లా ఎస్పీ రాహుల్‌ ‌హెగ్డే సైతం పోలీస్‌ అధికారులను అప్రమత్తంగా ఉండాలని,లోతట్టు గ్రామాల ప్రలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌ ‌గంభీరావుపేట మండలం లోని ఎగువ మానేరు ప్రాజెక్టును పరిశీలించండంతో పాటు గంభీరావుపేట- లింగన్నపేట రోడ్డుపై ప్రవహిస్తున్న నీటి ఉధృతిని పరిశీలించారు.అంతేగాకుండా ఇదే మండలంలో తెగిన జగదాంబ తండా రోడ్డును ఆయన పరిశీలించారు. సిరిసిల్ల వాగు,వేములవాడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వందలాది స్థానికులు వీటిని చూడటానికి గుమిగూడుతున్నారు.వేములవాడ వాగు పై నిర్మిస్తున్న రెండవ బ్రిడ్జి ప్రవాహ ఉథృతికి తట్టుకుంటుకుంటుందా లేక గతంలో మాదిరిగా కుంగిపోతుందా అని స్థానికులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా రగుడు వద్ద ఇటీవల ప్రారంభమైన జిల్లా కలెక్టరేట్‌ ‌జలదిగ్డంధంలో చిక్కుకు పోయింది.దీనితో అధికారులు అప్రమత్తమై ఆ నీటిని తొలగించడానికి తీవ్రంగా యత్నిస్తున్నారు.గురువారం రాత్రి సైతం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ కాగా ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Leave a Reply