సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు
గోదావరి జిల్లాల్లో పొంగుతున్న వాగులు
గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
విశాఖపట్నం,ఆగస్ట్ 13 : ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఎపిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. రెండు రోజులు అక్కడే స్థిరంగా కొనసాగి, మరింత బలపడనుందని తెలిపింది. రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, యానాంలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీర ప్రాంతంలో గంటకు 45-55 కిలోటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 3.5 టర్ల ఎత్తులో ఎగసిపడే అలలతో సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలో ముసురు వాతావరణం నెలకొంది. విశాఖ, ఉభయగోదావరి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంతంలో గంటకు 45-55 కిలోటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 3.5 టర్ల ఎత్తులో ఎగసిపడే అలలతో సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 9.40 అడుగులకు పెరిగింది.
ఈ క్రమంలో అధికారులు 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేసి 4.05 లక్షలు క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు 10,500 క్యూసెక్కుల సాగు నీరు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డాం వద్ద గోదావరి వరద నీరు 24.750 టర్లకు చేరింది. అలాగే పోలవరం వద్ద నీటిమట్టం 10.610 టర్లకు చేరింది. అటు కొత్తూరు కాజ్వేపై 5 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. దీంతో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వార్షాలకు వాగుల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా, వేలేరుపాడు మండలంలో ఎద్దు వాగు, లోతు వాగు కాజ్వే పైకి గోదావరి వరద చేరుకుంది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతుంది.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 24.75 టర్లు చేరింది. ఇప్పటికే స్పిల్ ఛానల్ కు అనుసంధానంగా ఉన్న గోదావరి గట్టు తెగిపోవడం తో స్పిల్ ఛానల్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. పోలవరం వద్ద 10.61 వరకు నీటిమట్టం నమోదయింది. ప్రాజెక్ట్ ఎగువన ఉన్న కొత్తూరు కాజ్వే పైకి 5 అడుగులు నీరు చేరడంతో సుమారు 19 గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతి సంవత్సరం గోదావరికి వరద వచ్చే సమయంలో కొత్తూరు కాజ్వే పై వరద నీరు చేరడంతో గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే గోదావరి అడ్డుగా ఎగువ కాపర్ డ్యామ్ నిర్మించడంతో గోదావరి వరద తక్కువగా వచ్చిన ఉధృతి పెరిగి గిరిజన గ్రామాలను ముంచెత్తుతుంది. ప్రస్తుతం గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతుండడంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కొత్తూరు కాజ్వే పై రాకపోకలకు పోలీసులు ఆంక్షలు విధించారు. గిరిజనులు ప్రయాణించేందుకు పడవలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.