Take a fresh look at your lifestyle.

భారీ నుంచి అతి భారీ వర్షాలు..

 

Heavy rains in several districts across the state రాష్ట్రంలో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ  సూచనల నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి.లను  అప్రమత్తం చేశారు. 

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం  జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని దీనితో   లోతట్టు ప్రాంతాలలో నీటి ప్రవాహం, నీరు నిలిచే అవకాశం ఉందని, భారీ వర్షాలతో  విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నందున అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ప్రాజెక్ట్ లు, రిజర్వాయర్ లు ఓవర్ ప్లో వలన లోతట్టు ప్రాంతాల్లో జలమయం అయ్యే అవకాశం ఉంది ఆయా ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండి ప్లడ్ ప్రోటోకాల్ ను పాటించి తగు సూచనలు, సలహాలు చేయాలి. లో లెవల్ బ్రిడ్జ్, కాజ్ వే లపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాదచారులు నడవకుండా నిషేధం చేయాలని, ఎటువంటి  ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టాలని  ప్రధాన కార్యదర్శి తెలిపారు.భారీ వర్షాలతో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

మరో వైపు సోమవారం ఉదయం నుంచే జంట నగరాల్లో భారీ  వర్షం కురుస్తుంది.

 

 

 

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply