Take a fresh look at your lifestyle.

భారీ వర్షాల నేపథ్యంలో… సీజనల్‌ ‌వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

వైద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆ ‌శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. నీరు కలుషితమై వచ్చే డయేరియా, దోమల వల్ల వచ్చే మలేరియా, చికున్‌గున్యా, డెంగీ వంటి వ్యాధులతో పాటు వైరల్‌ ‌ఫీవర్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకు మంత్రి ఈటల బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ‌పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ‌శాఖలతో సమన్వయం చేసుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. కొరోనాతో పాటు ఈ్వ రాలు అన్నింటికీ చికిత్స చేసే విధంగా అన్ని ప్రభుత్వ దవాఖానాలలో బెడ్లు, మందులు, వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల మీద దృష్టి సారించాలనీ, జిల్లా, ఏరియా దవాఖానాలు మొదలుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈమేరకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండి చంద్రశేఖరరెడ్డిని ఆదేశించారు. ఉస్మానియా హాస్పిటల్‌, ‌నిమ్స్ ‌హాస్పిటల్స్ ‌నాన్‌ ‌కోవిడ్‌ ‌దవాఖానాలుగా ఉన్నాయనీ, అందువల్ల అక్కడ అన్ని రకాల వైద్య చికిత్సలు అందేలా చూడాలన్నారు. అన్ని రకాల జబ్బులకు ఇన్‌ ‌పేషెంట్‌, ఔట్‌ ‌పేషెంట్‌ ‌సేవలు అందుబాటులో ఉండాలనీ, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం‌లు రోజువారీ సర్వే చేయాలన్నారు. జ్వరంతో పాటు ఇతర జబ్బులను కూడా పరిశీలించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువ దృష్టి సారించి యాంటీ లార్వల్‌ అపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే, సీజనల్‌ ‌వ్యాధులు, అంటు వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, చికిత్సపై మరోమారు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు  ఈ సందర్భంగా మంత్రి ఈటల వెల్లడించారు.

Leave a Reply