Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు ..!

అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులకు ఆదేశాలు 
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తక్షణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్ పి లను ఆదేశించారు.  గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 16 మంది కలెక్టర్లు, ఎసి పి లతో నిర్వహించిన టెలికాన్ఫరేన్సులో వరదల పరిస్థితిపై సమీక్షించారు.
జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లాలలోని అన్ని శాఖలు సమన్యయంతో పనిచేయాలని పేర్కొన్నారు.  చెరువులు, కుంటలు గండ్లు పడకుండా చూసుకోవాలని తెలిపారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అవసరం మేరకు ప్రభుత్వం అన్ని రకాల సహాయక సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ విషయమై ఆయా జిల్లా కలెక్టర్లు విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి  రాహుల్ బొజ్జా తో సంప్రదించాలని తెలిపారు.
  డీజీపీ  మహేంద్ర రెడ్డి,  నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రజత్ కుమార్,  లెఫ్టినెంట్ కల్నల్ కమల్ దీప్, డిజి ఫైర్ సర్వీసెస్  ఎస్ కె జైన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి  సందీప్ కుమార్ సుల్తానియా, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రత్యేక కార్యదర్శి  రాహుల్ బొజ్జా, సిఎండి NPDCL,  గోపాల్ రావు,  పంచాయతీ రాజ్ కమిషనర్  రఘునందన్ రావు, నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, NDRF అధికారి  దామోదర్ సింగ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply