Take a fresh look at your lifestyle.

మణుగూరులో భారీ వర్షం

ఉప్పొంగిన కట్టవాగు..జలమలమైన మున్సిపాలిటీ – అధికారుల నిర్లక్ష్యం 24గంటల నీటిలోనే వున్న ప్రజలు

మణుగూరు సబ్‌ ‌డివిజన్‌ ‌పరిధిలో భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి 10గంటల నుండి ఉదయం వరకు కుండపోత వర్షం కురవడంతో వాగులు ఉప్పొంగాయి. మణుగూరు పట్టణంలో వరద ఉదృతి ఎక్కువకావడంతో వాగులో చెట్లు, పుచ్చి మొక్కలు దానికితోడు చెత్త పేరకపోవడంతో వరద నీరు గాంధీనగర్‌, ‌సుందరయ్యనగర్‌, ‌మేదర్‌బస్తీ, ఆదర్శనగర్‌ ఏరియాలు పూర్తిగా జలమలయ్యాయి. మున్సిపాలిటీ ప్రజలు చేసేది ఏమిలేక 24• గంటలు వర్షపు నీటిలో గడిపారు. ఉదయం మున్సిపల్‌ అధికారులు జేఏబితో వర్షపు వేళ్లేందకు గురువారం సాయంత్రం వరకు శ్రమించాల్సి వచ్చింది. అయన సరే నీరు వేళ్లకపోవడంతో లోతట్టు ప్రాంతాలు నీటిలోనే వున్నాయి.

ప్రధానంగా సత్యభాస్కర్‌ ‌థీయేటర్‌ ‌పరిసర ప్రాంతాల్లో నీటిని వాగులోకి మళ్లించేందుకు శతవిధాల ప్రయత్నించారు. వాగుకి ఇరువైపుల కరకట్ట వుండడంతో నీరు వాగులోకి వేళ్లకుండా అలానే వుండిపోయింది. రోడ్డుకు ఇరువైపుల వున్న డ్రైనేజి నిర్మాణం చేపట్టేందకు పగటకొట్టారు. నూతన నిర్మాన పనులు చేపట్టకపోవడంతో కాలువలోని మురుగంతా ఆదర్శనగర్‌లో పెరుకుపోయింది. దీంతో గ్రామస్థులు భయందోళనకు గురయ్యారు. పట్టణ ప్రగతిలో భాగంగా కట్టవాగులో పెరుకు పోయిన చెత్తను, చెట్లను తొలగించి న్నట్లుయితే ఈ ప్రమాదం జరిగేది కాదని ప్రజా సంఘాల తెలిపారు.

Leave a Reply