Take a fresh look at your lifestyle.

మణుగూరులో భారీ వర్షం -విద్యుత్‌కు అంతరాయం

నిలిచిన బొగ్గు ఉత్పత్తి,నత్తనడకన సాగిన బిటిపిఎస్‌ ‌నిర్మాణ పనులు

మణుగూరు,జూలై 22 (ప్రజాతంత్ర విలేకరి) :  మణుగూరు సబ్‌ ‌డివిజన్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోజువారి ఉత్పత్తి 3వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయాల్సి వుండగా పూర్తి స్తంభించింది. భద్రాద్రి పవర్‌ ‌ప్లాంట్‌ ‌నిర్మాణ పనులు వర్షాల కారణంగా నత్తనడకన సాగాయి. మణుగూరు మున్సిపాలిటీ, మండలంలో లోతట్టు ప్రాంతాలు వరదమయ్యయి. దీని కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.

ఇటివల అంబేద్కర్‌ ‌సెంటర్‌ ‌నుండి రైల్వే గేట్‌ ‌వరకు నిర్మించిన సైడ్‌ ‌డ్రైనేజి ఒక ప్రక్కనే నిర్మించడంతో నీరు ఏటుపోకుండా రోడ్డుపైనే నిలిచాయి. నిర్మాణ పనులు పూర్తి అయిన కాలువ ఎత్తుగా వుండడంతో వర్షపు నీరు కాలువలోకి పోలేక చెరువులను తలపిస్తున్నాయి. మురుగు నీరు రోడ్డుపైకి చేరి దుర్వాసన వేదజల్లడంతో ప్రజలు ఇబ్బందులకు గురవతున్నారు.  109.6 మీ.మీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీని కారణంగా విద్యుత్‌ ‌స్తంభాలు మరియు చెట్లు విరిగి పడడంతో గత రెండు రోజుల నుండి ఏరియాలో విద్యుత్‌ ‌సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏఈ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో లైన్‌మెన్‌ ‌సిబ్బంది రాత్రిపగలు అనక శ్రమించి ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్‌ ‌సరఫరా అయ్యేలా పనిచేశారు.

Leave a Reply