Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో భారీ వర్షం..పలు ప్రాంతాల్లో జోరువాన

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఫిలింనగర్‌, ‌మాదాపూర్‌, ‌జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, ‌యూసుఫ్‌గూడ, అవి•ర్‌పేట, పంజాగుట్టలో వర్షం కురిసింది. దీంతో జీహెచ్‌ఎం‌సీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు నేడు ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 5 రోజులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 12, 13 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు పేర్కొంది. రాగల రెండు, మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు కురిసే వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా వొచ్చే అవకాశం ఉన్నట్లు వివరించారు.

Leave a Reply