- కోలుకోక ముందే లోతట్టు ప్రాంతాలు మళ్లీ జలమయం
- హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో కురిసిన కుండపోత వానకు రోడ్లు జలమయం అయ్యాయి. దట్టమైన మేఠాలు కమ్ముకున్న ఆకాశంతో నగరంలో చీకట్లు అలముకున్నాయి. ఉదయం నుంచి భాగ్యనగరంలో దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. నగరమంతా పట్టపగలే చీకటి కమ్ముకుంది. ఉరుములు, మెరుపులతో హడలెత్తించింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం దంచికొట్టింది. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వానల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యాయి.
నగర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అత్యవసర సేవల కోసం 100కు డయల్ చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలతో పాటు శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ జలాశయంలోకి 1,560 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో తూముల ద్వారా 2,098 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 వి•టర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 513.67 వి•టర్లకు చేరింది. హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.