Take a fresh look at your lifestyle.

జలదిగ్బంధం.. భాగ్యనగరం

  • కుంభవృష్టితో హైదరాబాద్‌ అతలాకుతలం
  • నీట మునిగిన పలు కాలనీలు
  • కొట్టుకుపోయిన కార్లు, టూ వీలర్లు
  • 12 మంది మృతి..పలువురికి గాయాలు
  • వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కెటిఆర్‌
  • ‌పలుచోట్ల ప్రజలను సహాయక శిబిరాలకు తరలింపు
  • బాధితులకు భరోసా….సహాయక చర్యలు ముమ్మరం
  • ప్రమాదకరస్థాయిలో హుస్సేన్‌ ‌సాగర్‌
  • ‌మూసీని ముంచెత్తిన వరద..ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, నాలాలు
  • ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు సంస్థలకు రెండు రోజుల సెలవు ప్రకటించిన ప్రభుత్వం

భారీ వర్షానికి హైదరాబాద్‌ అతలాకుతలం అయ్యింది. కాలనీలన్నీ నిండా మునిగాయి. కార్లన్నీ నీట మునిగాయి. కనీవినీ ఎరుగని కల్లోలం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. వందలాది కుటుంబాలు నీట మనుగడంతో మిద్దెలు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. నాలాలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి. వరద ఉదృతికి కార్లు సహా పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను వరద నీరు ముచెత్తింది. గత 24 గంటల్లో హైదరాబాద్‌ ‌లోని పలు ప్రాంతాల్లో 20 సెం.కు పైగానే వర్షపాతం నమోదయ్యింది. వర్ష బీభత్సానికి దాదాపు 12 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరో రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. సికింద్రాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ ‌కింద పార్క్ ‌చేసిన కారుపైకి వరద ప్రవాహానికి మరో కారు వచ్చి చేరింది.

heavy floods in hyderabad

ఇంకో వైపు నుంచి మూడవ కారు కూడా వచ్చి వాటిని ఢీకొట్టిన దృశ్యాలు వరద భీభత్సానికి అద్దం పడుతోంది. భారీ వాహనాలు సైతం నీళ్లలో తేలుతూ కొట్టుకు పోయాయి. కారులో డ్రైవర్‌ ‌లేకున్నా అత్యంత వేగంగా వాహనాలు కదులుతూ కనిపిస్తుండటంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. పలు అపార్‌మెంట్‌ ‌సెల్లార్‌లోకి సైతం భారీగా వరద నీరు రావడంతో వాహనాలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు సంస్థలకు అక్టోబర్‌ 14,15.. ‌రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సహాయక చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలను సైతం రంగంలోకి దించింది. పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. అత్యవసం అయితే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఆహారం అందిస్తున్నారు. అలాగే పలు చోట్ల ప్రభుత్వం సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో వారికి ఆహారంతో పాటు అవసరమైన వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, ‌రాష్ట్ర •ం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిని సక్షించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ముంపు బాధితులతో మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అదుకుంటామని, ఆందోళనపడొద్దని సూచించారు.

వరద ప్రాంతాల్లో కెటిఆర్‌ ‌పర్యటన
హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పర్యటించారు. ముంపు బాధితుల సమస్యలను కేటీఆర్‌ ఓపికగా అడిగి తెలుసుకున్నారు. ముసారాంబాగ్‌లోని సలీంనగర్‌లో బుధవారం మధ్యాహ్నం కేటీఆర్‌ ‌పర్యటించి.. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. రాబోయే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. వానలు తగ్గే సూచన లేదు. ఇప్పుడు ఎక్కడైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారు.. మరో రెండు రోజుల పాటు కూడా అక్కడే ఉండాలని ముంపు బాధితులకు కేటీఆర్‌ ‌సూచించారు. బాధితులందరికి వైద్య పరీక్షలు చేయించి, మందులు ఇస్తామన్నారు. భోజనం పెడుతామన్నారు. దుప్పట్లు కూడా సరఫరా చేస్తామన్నారు. వీటితో పాటు నష్ట పరిహారం కూడా చెల్లిస్తామని కేటీఆర్‌ ‌భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యలపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్‌ ‌ప్రకటన చేశారు.

ప్రమాదకరస్థాయిలో హుస్సేన్‌ ‌సాగర్‌
‌భారీ వర్షాలతో ట్యాంక్‌బండ్‌ ‌వద్ద హుస్సేన్‌ ‌సాగర్‌ ఉ‌గ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో సాగర్‌ ‌ప్రమాదకరస్థాయికి చేరింది. వరద నీటిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌, ‌డిప్యూటీ మేయర్‌ ‌మహ్మద్‌ ‌బాబా ఫసియుద్దీన్‌లు బుధవారం ట్యాంక్‌ ‌బండ్‌ను సందర్శించి వరద పరిస్థితులను పరిశీలించారు. వరద నీటి దృష్ట్యా నగర వాసులంతా బయటకు రావొద్దని ఇళ్లలోని సురక్షితంగా ఉండాలంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు. అదే విధంగా జలమండలి ఎండీ దాన కిషోర్‌ ‌హిమాయత్‌ ‌సాగర్‌ను సందర్శించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమావేశమయ్యారు. జలాశయం దిగువన ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచాలని ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్‌ ‌మహాత్మగాంధీ బస్‌స్టాండ్‌లోకి వరద నీరు భారీగా రావడంతో వచ్చిపోయే బస్సులకు ఆటంకం కలిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాతబస్తీలో వరదనీటిలో కొట్టుకు పోయిన వ్యక్తి
భారీ వర్షానికి పాతబస్తీలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకు పోయాడు. ఎవరూ రక్షించలేని పరిస్థితి నెలకొంది. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోయాయి. కొత్తగా వేసిన రోడ్లు కూడా గుంటలు పడ్దాయి. బంజారాహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. యోగా క్లినిక్‌లోకి చేరిన వర్షపు నీరు చేరింది. నీటిని తోడేందుకు మోటార్‌ ‌వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌ ‌షాక్‌ ‌సంభవించింది. ఈ ప్రమాదంలో డాక్టర్‌ ‌సతీష్‌రెడ్డి మృతిచెందారు. దీంతో ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇకపోతే నాళాలు, నగర శివారులో ఉన్న చెరువులు కబ్జాకు గురి కావడంతో చెరువులు కట్టలు తెగి వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల వల్ల బాగ్‌లింగంపల్లిలోని హెచ్‌ఐజీ-2, బ్లాక్‌ 21‌లో హౌసింగ్‌ ‌బోర్డు నిర్మించిన అపార్ట్‌మెంట్‌ ‌పిల్లర్లు ఫీటు లోతు కుంగిపోయాయి. గోడలు, పిల్లర్లు పగుళ్లు ఇచ్చాయి. అపార్ట్‌మెంట్‌ ‌కూలిపోతుందేమోనని అందులో నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అపార్ట్‌మెంట్‌ ‌ప్రమాదకరంగా ఉందని అధికారులు గతంలో నోటీసులు ఇవ్వడంతో అందులో నివసిస్తున్న 12 కుటుంబాల్లో సగం మంది ఖాళీ చేశారు. అందరినీ ఖాళీ చేయించాలని జీహెచ్‌ఎం‌సీ సర్కిల్‌ ‌డీఎంసీ ఉమాప్రకాష్‌, ఏసీపీ పావని, కార్పొరేటర్‌ శ్రీ‌నివాస్‌రెడ్డికి అపార్ట్‌మెంట్‌ ‌వాసులు గతంలో విన్నవించినా చర్యలు తీసుకోలేదు.

అపార్ట్‌మెంట్‌ ‌నిర్మించి 20 ఏళ్లు కాకముందే పిల్లర్లు కుంగిపోవడం, గోడలు పగుళ్లు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాతబస్తీలో రెస్క్యూ ఆపరేషన్‌ ‌నిర్వహిస్తున్నారు. చాంద్రాయణగుట్టలో ఆర్మీ హెలికాప్టర్‌ ‌రంగంలోకి దిగింది. ఫలక్‌నుమా పరిసరాల్లో వరదనీటిలో చిక్కుకున్న వారిని… సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. కాగా.. మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రహహిస్తోంది. చాదర్‌ఘాట్‌ ‌వద్ద పది అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూసానగర్‌, ‌శంకర్‌ ‌నగర్‌, ‌కమల్‌నగర్‌ ‌పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు డాబాలపైకి చేరారు. చాదర్‌ఘాట్‌ ‌దగ్గర కొత్త వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. పటాన్‌ ‌చెరు నియోజకవర్గంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి నాలాలు పొంగిపొర్లుతున్నాయి. అన్‌పూర్‌ ‌సాయి కాలనీలో కాలువ పొంగి పొర్లడంతో దుకాణ సముదాయం నీటమునిగింది. ఆల్విన్‌ ‌కాలనీలో భారీ వర్షాలకు ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షపు నీటిలో సామాన్లన్నీ తడిచి పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ముత్తంగి ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై ట్రాఫిక్‌ ‌నిలిచిపోయింది. భారీ వర్షాలు పడుతుండటంతో వాహనాలను టోల్‌ ‌గేట్‌ ‌సిబ్బంది నిలిపివేసింది.

Water into the prajatantra unit
‌ప్రజాతంత్ర’ యూనిట్‌ ‌లోకి నీళ్లు

మూసీని ముంచెత్తిన వరద… అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి
మూసీ ఆయకట్టుకు ఎటువంటి పరిస్థితుల్లో డోకా ఉండబోదని విద్యుత్‌ ‌శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో ఒక్కసారిగా వరద ఉధృతి తీవ్రం కావడంతో.. అప్పటికప్పుడు అదే రాత్రి సూర్యాపేట, నల్గొండ జిల్లా కలెక్టర్ల తోపాటు నీటిపారుదల అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. సూర్యాపేట జిల్లా రత్నపురం వద్ద గండి పెట్టి నీటిని కిందికి వదలాలి అంటూ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో సోషల్‌ ‌డియా ద్వారా ఆయకట్టు కింది ప్రజలను జాగ్రత్తగా ఉండాలి అంటూ విజ్ఞప్తి చేసారు. మూసీ ఆయకట్టు దకు చేరుకుని అత్యవసర ద్వారాలతో పాటు పూర్తిగా తలుపులు తీయించి 1.75 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో ఆయకట్టు రైతాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి డియాతో మాట్లాడుతూ.. చరిత్రలో ముందెన్నడూ ఊహించని రీతిలో వరద ఉధృతి మూసీకి చేరిందన్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుని నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటారని మంత్రి జగదీష్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply