Take a fresh look at your lifestyle.

పులిచింతలకు భారీగా వరదనీరు

మూడు గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు
భారీ వర్షాలతో వెదసాగు చేసిన రైతుల్లో ఆందోళన
గుంటూరు,జూలై23 : ఎగువన కురుస్తోన్న వర్షాల కారణంగా… పులిచింతల ప్రాజెక్టులో వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 62 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ప్రస్తుతం మూడు గేట్లు ఎత్తి 52,393 క్యూసెక్కుల నీటికి కిందికి వదులుతున్నారు. మరోవైపు విద్యుదుత్పత్తి కోసం 10 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించారు. పులిచింతల జలాశయం పూర్తిసామర్థ్యం 45.77 టిఎంసి లు కాగా.. ప్రస్తుతం 44.03 టిఎంసి ల నీరు నిల్వ ఉంది. కఅష్ణా నదిలోకి నీటిని విడుదల చేస్తుండటంతో పరీవాహక ప్రాంత గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇదిలావుంటే జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌ ‌ప్రారంభమైన తరుణంలో డెల్టాలో విద్యుత్‌ ‌బోర్ల కింద కొంత మంది నారుమళ్లు పోసుకోగా, ఎక్కువమంది రైతులు వెద పద్ధతి వరి సాగును ఎంచుకున్నారు. వర్షాల వల్ల ఈ పద్ధతి వేసిన వరి పొలాల్లో వర్షం నీరు నిలిచాయి. పంట కాల్వల్లో సైతం నీటితో పరవళ్లు తొక్కడంతో పొలాల్లో నుంచి నీరు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. అల్పపీడన ప్రభావంతో భారీవర్షాలు కురిస్తే మాత్రం అవి కూడా ముంపు బారిన పడతాయి. వర్షాల కారణంగా పొలాల్లో నీరు చేరి వరి విత్తనాలు ఒక చోట చేరి మురిగిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.10వేల వరకూ ఖర్చుపెట్టామని, మరోమారు వెద పెట్టాలంటే సమయం మించిపోతోందని అంటున్నారు. వర్షాలతో ఇప్పటికే సాగు చేసిన మెట్టపంటలకు జీవం పోసినట్లయింది. మాగాణి సాగు చేసే రైతులు వరి నారుమళ్లు పసేందుకు సిద్ధమవుతున్నారు. మెట్ట పంటలైన కూరగాయలు, పండ్ల తోటలు, తమలపాకు పంటల సాగుకు ప్రస్తుతం కురుస్తున్న వర్షం మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు. రాష్ట్రమంతటా వర్షాలు పడుతుండడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం మంగళగిరిలోని ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బందిని గురువారం వివిధ ముంపు ప్రాంతాలకు తరలించారు. విశాఖపట్నంకు రెండు బృందాలు, పోలవరం, దేవీపట్నానికి రెండేసి బృందాలు, భద్రాచలానికి ఒక బృందాన్ని సహాయక చర్యల నిమిత్తం ఇక్కడినుంచి పంపించారు. వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల నేపధ్యంలో మరిన్ని బృందాలను ఇతర ప్రాంతాలకు పంపించేం దుకు సన్నద్ధం చేస్తున్నారు. వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చిరు వ్యాపారులు, కూలీలు, చేతివృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Leave a Reply