Take a fresh look at your lifestyle.

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

ప్రస్తుతం 847.90 అడుగులకు చేరిన నీటిమట్టం
కర్నూలు,జూలై23 : శ్రీ‌శైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతితో ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతోంది. ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలకళ సంతరించుకుంటోంది. దీంతో ప్రాజెక్ట్ ఇన్‌ ‌ప్లో 1,22,836 క్యూసెక్కులు, ఔట్‌ ‌ప్లో : 35,315 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 847.90 అడుగులకు చేరింది.మరోవైపు ఎడమగట్టు జలవిద్యుత్‌ ‌కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి ప్రాజెక్ట్ ‌నుండి నారాయణపూర్‌ ‌ప్రాజెక్ట్ ‌కి భారీగా వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు 29 గేట్‌ ‌లు ఎత్తి జూరాల ప్రాజెక్ట్ ‌కి నీటిని విడదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్‌ ఇన్‌ ‌ప్లో 1,50,000 క్యూసెక్కులుగా ఉండగా ఔట్‌ ఎ•-‌లో 2,30,680 క్యూసెక్కులుగా ఉంది.

ఇక ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 33.31 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 26.85 టీఎంసీలుగా ఉంది. దిగువకు నీటిని విడుదల చేయడంతో కృష్ణ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక అధికారులు హెచ్చరించారు. జూరాలకు చేరిన నీటిని దిగువకు విడుదల చేయడంతో శ్రీశైలం చేరుతోంది.

Leave a Reply